Home » క్లైమాక్స్ బాగలేకపోవడంతోనే ఫ్లాప్ అయిన ప్రభాస్ మూవీస్ గురించి తెలుసా ?

క్లైమాక్స్ బాగలేకపోవడంతోనే ఫ్లాప్ అయిన ప్రభాస్ మూవీస్ గురించి తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినిమాలు ఎప్పుడు ఎలా ఉంటే హిట్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా క్లైమాక్స్ సూపర్ ఉన్న సినిమాలు చాలానే హిట్ అయ్యాయి. అందులో మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చే సన్నివేశంలో ప్రతీ ప్రేక్షకుడిని కట్టిపడేశాడు మ్యూజిక్ దర్శకుడు మణిశర్మ. చాలా సినిమాలు ఫస్టాప్ నార్మల్ గా ఉండి.. సెకండ్ హాప్ బాగుంటే చాలు మంచి విజయాలను సాధిస్తాయి. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న చాలా సినిమాలు ఇలా హిట్ అయినవే. మరికొన్ని సినిమాలు మాత్రం క్లైమాక్స్ సెట్ కాకపోవడం వల్లనే ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ప్రభాస్ కెరీర్ లో ఏయే సినిమాలున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

యోగి :

Advertisement

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా యోగి. భారీ అంచనాల మధ్య విడుదలైంది ఈ సినిమా. మంచి విజయం సాధిస్తుందనుకున్నారు దర్శక, నిర్మాతలు. కానీ ఈ మూవీ వారి అంచనాలన్నింటికి తలకిందులు చేసింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సూపర్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో హీరో వాళ్ల అమ్మ మొహం కూడా చూడకుండా మరణిస్తుంది. కనీసం తల్లిని చివరి చూపు కూడా చూడకుండా మిగిలిపోయిన హీరో కథగా ఈ మూవీ ఉండటంతో  ప్రేక్షకులను ఆ సీన్ అంతగా నచ్చలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాన్ అయింది. క్లైమాక్స్ మార్చి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. 

ఏక్ నిరంజన్ :

ప్రభాస్ నటించిన సినిమాలో మరో మూవీ ఏక్ నిరంజన్. ఈ మూవీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా బాగుంటుంది. కానీ క్లైమాక్స్ ఈ సినిమా కొంప ముంచింది. చివరిలో వాళ్ల ఫ్యామిలీని కలవకుండా డైరెక్టర్ పెట్టిన టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అది అది వర్కవుట్ కాలేదు. దీంతో ఈ సినిమాకి కూడా ఫ్లాప్ అయింది. కేవలం క్లైమాక్స్ బాలేకపోవడం వల్లనే ప్రభాస్ నటించిన ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

2023లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన టాలీవుడ్ సినిమాలు ఇవే !

 పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

 

Visitors Are Also Reading