Home » Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

by Bunty
Ad

 

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కాస్త విభిన్నంగా ఆలోచిస్తాడు. ఆటలో అయినా….జీవన విధానంలో కోహ్లీ టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆటలో ఎంత నాణ్యత ఉంటుందో లైఫ్ లో కూడా అంతే రాయల్ గా ఉండేలా చూసుకుంటాడు. కోహ్లీ క్రికెట్ కెరియర్ మనందరికీ తెలుసు. కానీ విరాట్ ఇంటి గురించి పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు.

Advertisement

కోహ్లీ కూడా ఎప్పుడు తన ఇంటిని చూపించాలి అనుకోలేదు. కానీ కోహ్లీ కట్టించుకుంటున్న కొత్త ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది ఎకరాల్లో కోహ్లీ తన కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు. 8 ఎకరాల్లో సువిశాలమైన ప్రదేశంలో తన టేస్ట్ కు తగ్గట్టుగా నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటి నిర్మాణం మొదలయ్యింది. ఆ మధ్య కోహ్లీ 20 కోట్లు వెచ్చించి 8 ఎకరాలను కొనుగోలు చేశాడు.

Advertisement

మహారాష్ట్రలోని ఆలీబాగ్ లో కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది. ప్రముఖ ఆర్కిటెక్ కోహ్లీ కొత్త ఇంటి నిర్మాణాన్ని డిజైన్ చేశాడు. విశాలమైన జిమ్, ఇంట్లోనే క్రికెట్ ఆడుకునేందుకు వీలుగా నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. తన గారాల పట్టి వమికా కోసం ఓ స్పెషల్ రూమ్ ను డిజైన్ చేయిస్తున్నాడట. ప్రస్తుతం కోహ్లీ విశ్రాంతిలో ఉండడంతో తన కొత్త ఇంటి నిర్మాణాన్ని చూసుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

హీరోయిన్‌ శోభన పెళ్లికి దూర‌మ‌వ్వ‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మ‌యా…!

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

Visitors Are Also Reading