Home » మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు.. తెలుసా..?

మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు.. తెలుసా..?

by Sravya
Ad

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ విపరీతంగా మహేష్ బాబు ఫోటోలని షేర్ చేయడం, సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలపడం చేస్తున్నారు. మహేష్ బాబు జన్మదిన సందర్భంగా మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 48 ఏళ్ల వయసులో.. నటుడిగా త్వరలో 44 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నారు. మహేష్ బాబు హీరోగా 24 ఏళ్ల నట స్థానాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది.

Advertisement

మహేష్ బాబు 1975 ఆగస్టు 9న చెన్నైలో పుట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలుకొట్టేసి పేరు సంపాదించేసుకున్నారు. టాలీవుడ్ మార్కెట్ పరిధిని కూడా మహేష్ బాబు పెంచారు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాల్లో బిజీగా ఉన్నారు మహేష్. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమాతో బాలనటుడిగా మహేష్ బాబు పరిచయమయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు ఐదు సినిమాలు చేశారు ఫుల్ హీరోగా మారిపోయిన తర్వాత కృష్ణ దర్శకత్వంలో నటించలేదు.

Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి అందరినీ ఆకట్టుకున్నారు మహేష్ బాబు. పూర్తిస్థాయి హీరోగా మహేష్ బాబు నటించిన మొదటి సినిమా రాజకుమారుడు. ఆ తర్వాత అనేక సినిమాలు చూసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. మహేష్ కెరియర్ పోకిరి సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. పెద్ద స్టార్ హీరోగా పాపులర్ అయిపోయారు. యుఎస్ మార్కెట్లో మిలియన్ డాలర్లను వసూలు చేసిన పది చిత్రాలు కలిగిన ఏకైక నటుడు మన మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ ని సాధించేశారు మహేష్.

Also read:

Visitors Are Also Reading