ఒక మ్యాచ్ లో జట్టును గెలిపిస్తే ఆ ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కుతుంది. సిరీస్ మొత్తం మెరుగైన ప్రదర్శన చేస్తే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు కింద చెక్ లేదా ట్రోఫీ లేదా కార్ లేదా బైక్ ఇలా వస్తు రూపంలో ఇచ్చి అభినందిస్తారు. కానీ భూమి ఇచ్చి అభినందించడం మీరు ఎప్పుడైనా చూసారా? కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 మూడవ సీజన్లో సరే జాగ్వార్స్, మోంటెరల్ టైగర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
Advertisement
మొదట బ్యాటింగ్ చేసిన సరే జాగ్వార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనంతరం లక్షచేదనలో టైగర్స్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 135 పరుగులు చేసింది. టైగర్స్ తరుపున రూథర్ ఫోర్డ్ చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. రూథర్ ఫోర్డ్ 29 బంతుల్లో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లీగ్ లో రూథర్ ఫోర్డ్ 220 పరుగులతో సత్తా చాటాడు. దీంతో రూథర్ ఫోర్డ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
Advertisement
టోర్నీలో అద్భుతంగా రాణించిన రూథర్ ఫోర్డ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు అరఎకరం భూమి ఇచ్చారు. అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో. క్రికెట్ లో బహుమతిగా ల్యాండ్ ప్రజెంట్ చేయడం బహుశా ఇదే తొలిసారి. విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ చేతుల మీదుగా రూథర్ ఫోర్డ్ ఈ అవార్డు అందుకున్నాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పలువురు నెటిజన్లు దీనిపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రూథర్ ఫోర్డ్ ఐపీఎల్ లోను మెరిశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల తరపున కొన్ని మ్యాచ్లు ఆడాడు.
ఇవి కూడా చదవండి
విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !
సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?
Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?