Home » రీ రిలీజ్ సినిమాలు మరీ టూ మచ్.. ఇలా అయితే ఎలా ?

రీ రిలీజ్ సినిమాలు మరీ టూ మచ్.. ఇలా అయితే ఎలా ?

by Anji
Ad

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలు చాలా ఎక్కువవుతున్నాయి. ఓవైపు రెగ్యులర్ సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ వారానికి ఒక అనౌన్స్ మెంట్.. 10 రోజులకో సినిమా రిలీజ్ అవుతూ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అందుకొన్ని రీ రిలీజ్సినిమాలు కూడా రికార్డులను సృష్టిస్తున్నాయి. మరికొన్ని మూవీస్ మాత్రం అంతగా ఆడటం లేదు. రీసెంట్ గా డబ్బింగ్ మూవీ అయిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రీ రిలీజ్ అయినప్పుడు కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ హంగామా చేశారో తెలిసిన విషయమే. 

Advertisement

ఈ మూవీ ఏకంగా తెలుగు స్టార్ హీరోల మూవీస్ లెవల్ లో రికార్డు వసూళ్లను సాధించింది. ఈ విషయంపై స్పందిస్తూ.. హీరో సూర్య అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇప్పటికీ సిటీ ఏరియాల్లో కొన్ని థియేటర్లలో ఆ మూవీ రన్ అవుతుంది. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా మరో డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఆ చిత్రమే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్. ఆగస్టు 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య సన్ ఆఫ్  కృష్ణన్ ఎఫెక్ట్ వల్లనే ఈ మూవీ కూడా రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

మరోవైపు టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మేన్ మూవీ ఆగస్టు 09న రీ రిలీజ్ చేయనున్నారు. ఇదే రోజు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ విడుదలవుతోంది. దీంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇలా రీ రిలీజ్ చేసుకుంటూ పోతే ఆడియన్స్ వీక్షించడానికి సిద్ధంగా ఉండాలి గా..? అన్ని సినిమాలను వెంట వెంటనే విడుదల చేసుకుంటూ పోతే రెగ్యులర్ సినిమాలు ఎప్పుడూ చూడాలి ? అంటూ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ కౌంటర్లు వేస్తున్నారు. మరికొందరూ రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తక్కువ రేట్లకు టికెట్లు విక్రయిస్తే.. సినిమా చూస్తామని లేదంటే పట్టించుకోమని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రీ రిలీజ్ సినిమాలు వారానికి ఒకటి టూ మచ్ గా వస్తున్నాయని పేర్కొనడం గమనార్హం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న టాలీవుడ్ సినిమాలు ఇవే.. ఏంటో చూడండి!

శ్రీలీలను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేయడం వెనుక కారణం ఇదేనా ? 

Visitors Are Also Reading