Home » రూ.కోటికి భర్తను అమ్మిన భార్య.. ‘శుభలగ్నం’ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

రూ.కోటికి భర్తను అమ్మిన భార్య.. ‘శుభలగ్నం’ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో జగపతి బాబు, ఆమని, రోజా కాంబినేషన్ లో వచ్చిన సెన్షేషన్ మూవీ శుభలగ్నం. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. 1994లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. అలాంటి ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్య విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఈ చిత్రంలో హీరో జగపతి బాబు అమాయకరమైన భర్త.. హీరోయిన్ ఆమని భర్తను కోటి రూపాయలకు అమ్మేసి ఇక ఆ తరువాత భర్త కోసం పరితపిస్తూ చేసిన సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ఇందులో జగపతిబాబు చాలా నిజాయితీ గల ఉద్యోగిగా నటించాడు. కానీ ఆమె డబ్బే ప్రథమ ధ్యేయంగా భర్తను నమ్మకొని డబ్బులు చూసుకుంటూ కొన్నాళ్లు బతుకుతుంది. ఇక ఆ తరువాత మెస్మరైజ్ చేస్తుంది. ఇందులో కోటి రూపాయలకు అమ్మయడమనే కాస్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకులను అలరించనుంది. తమ్మారెడ్డి భరద్వాజ మాటల రచయిత దివాకర్ బాబు వెళ్లిన సమయంలో భూపతి రాజా దగ్గర ఉన్న రెండు కథల్లో ఏది బాగుంటుంది అని అడిగితే.. ఇందులో కోటి రూపాయలకు భర్తను అమ్మే సీన్ ఒకటి బాగుంటుందని చెప్పారట.

Advertisement

ఈ కథ అయితే అందరికీ న్యాయం జరుగుతుందని భావించారట. అశ్వినిదత్ కృష్ణారెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా కోసం ఎదురుచూస్తున్నారట. వెంటనే భూపతి రాజా వద్ద ఉన్న కథ గురించి దివాకర్ బాబు చెప్పాడట. చెప్పినట్టుగానే చివరికీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంత కష్టమైనా సరే పూర్తి చేయాలనే నిర్ణయానికి రావడంతో దివాకర్ బాబు మూడు రోజుల్లో మాటలు కూడా రాశారు. జగపతిబాాబు, రాధ పాత్రకు ఆమనిని సెలెక్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించేశారు. కేవలం రెండు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. 1994 అక్టోబర్ 30న విడుదలైంది. ప్రారంభంలో 3 రోజుల పాటు ఆకట్టుకలేదు. కానీ ఇక ఆ తరువాత ప్రతీ థియేటర్ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయింది. ముఖ్యంగా ఇందులో కోటి రూపాయలకు భర్తను అమ్మే సీన్ అందరికీ నచ్చింది. మహిళా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. ఈ చిత్రానికి 2 నంది అవార్డులు కూడా రావడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

భారీ పారితోషకం ఇస్తామన్న చిరంజీవితో నటించేందుకు వాణి శ్రీ ఒప్పుకోలేదు.. ఎందుకో తెలుసా ? 

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

 మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Visitors Are Also Reading