Home » మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబి మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తొంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం సీనియులను అంచాలను మించి భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తారు.

Advertisement

 

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ వంటి వారు చిత్ర యూనిట్ ని పొగడ్తలో ముంచెత్తుతారు. ఇటీవలే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అయితే ఈ వేడుకల్లో చిరంజీవి చేతికి ఉన్న వాచ్ చాలా మందిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ వివరాలను తెలుసుకునేందుకు సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. పలు నివేదికల ప్రకారం.. చిరు చేతికి పెట్టుకున్న రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ ధర 230,000 డాలర్లు. అనగా భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.1.90 కోట్లు. ఈ సంపన్నమైన టైమ్ పీస్ ప్రతిష్ట, గొప్పతనానికి నిజమైన చిహ్నం.

Advertisement

ఈ వాచ్ డిజైన్ చాలా సున్నితంగా ఎంతో అట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. కీర్తికి ప్రియుడిగా హీరో సుశాంత్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తయింది. U/A సర్టిఫికెట్ ని జారీ చేసింది సెన్సార్ బోర్డు. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు సాంగ్స్, కామెడీ బాగున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

RGV: పూనమ్ ట్వీట్ తో మొదలైన వివాదానికి ఆజ్యం పోసిన ఆర్జీవీ.. వైరల్ అవుతున్న ట్వీట్!

Bro: పవన్ కళ్యాణ్ భూమిపై కాలు పెట్టడం కరెక్ట్ కాదు అన్న నెటిజెన్ కి వచ్చిన ఈ రిప్లై చూస్తే నవ్వు ఆగదు!

Visitors Are Also Reading