Home » Bro: పవన్ కళ్యాణ్ భూమిపై కాలు పెట్టడం కరెక్ట్ కాదు అన్న నెటిజెన్ కి వచ్చిన ఈ రిప్లై చూస్తే నవ్వు ఆగదు!

Bro: పవన్ కళ్యాణ్ భూమిపై కాలు పెట్టడం కరెక్ట్ కాదు అన్న నెటిజెన్ కి వచ్చిన ఈ రిప్లై చూస్తే నవ్వు ఆగదు!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన బ్రో చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన బ్రో చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందించారు. కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Advertisement

 

అయితే.. ఈ సినిమా విడుదల అయ్యాక మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిపై కాలు పెట్టి నుంచున్న షాట్ ఒకటి ఉంటుంది. అయితే.. ఈ సన్నివేశం పై ఓ నెటిజెన్ కామెంట్ చేసారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కామెంట్ చేసినట్లు అనిపిస్తుంది. “ఎర్త్ మీద కాలు పెట్టడం కరెక్ట్ కాదు బ్రో..” అని ఓ నెటిజెన్ కామెంట్ చేసారు.

Advertisement

కాగా.. దీనికి మరొక నెటిజెన్ ఇచ్చిన రిప్లై చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు. ఆ కామెంట్ పెట్టిన నెటిజెన్ ని “నువ్వు రోజు ఎక్కడ అడుగు పెడుతున్నావ్ బ్రో?” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్ చూసి ఇతర నెటిజన్స్ ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు. కేవలం విమర్శించే ఉద్దేశ్యంతోనే కొందరు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే..ఈ కామెంట్ కి మరో నెటిజెన్ అదే రేంజ్ లో తిప్పి కొట్టారు.

మరిన్ని..

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

Visitors Are Also Reading