Home » 29 ఏళ్ల కిందట ఆ విమాన ప్రమాదం టాలీవుడ్ ని బ్రతికించిందనే విషయం మీకు తెలుసా ? 

29 ఏళ్ల కిందట ఆ విమాన ప్రమాదం టాలీవుడ్ ని బ్రతికించిందనే విషయం మీకు తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అలాంటి ఘటనలను గుర్తుకు తెచ్చుకుంటే మనకు తెలియకుండానే వణుకు పడుతుంది. ఇలాంటి ఘటనే ఒకటి టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల జీవితంలో కూడా చోటు చేసుకుంది. మామూలుగా విమాన ప్రమాదమంటే.. సాధారణంగా బతికి బట్టకట్టడం జరిగే పని కాదు. విమానం ఎక్కడ క్రాష్ అయినా లేదా ఇంజన్ లో లోపం సంభవించినా ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Advertisement

అయితే 1993 నంబర్ 15న చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పటికీ కూడా వణుకు పుట్టిస్తుంది. దాదాపు 29 ఏళ్ల కిందటే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ప్రయాణిస్తున్నటువంటి ఓ విమానం ప్రమాదానికి గురైంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమిళనాడులో ఉండే రోజుల్లో అక్కడనే షూటింగ్ లు ఎక్కువగా జరిగేవి. అప్పటి మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి ఓ విమానం బయలుదేరింది. అయితే దీపావళి పండుగకి 12 మంది సిబ్బందితో మొత్తానికి 262 మందితో కలిసి ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ బస్ A300 బయలుదేరింది. ఆ విమానం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ హైదరాబాద్ కి వచ్చేసరికీ వాతావరణం అంతగా అనుకూలించలేదు.

Advertisement

దీంతో ఆ విమానాన్ని తిరిగి మద్రాస్ వైపు మళ్లించారు.  కానీ ప్యూయల్ సమస్యతో అక్కడివరకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆ విమానాన్ని క్రాష్ లాండింగ్ చేసేశాడు పైలట్. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి మధ్యలో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. లాండింగ్ సమయంలో కాస్త అటు ఇటు అయినా పెద్ద ప్రమాదమే జరిగేది. తడిగా ఉన్నటువంటి పంట చేలల్లో విమానాన్ని ల్యాండింగ్ చేసారు. అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విజయశాంతి, అల్లు రామలింగయ్య కోడి రామకృష్ణ, దర్శకుడు బాపు, సుదాకర్, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి చాలా మంది ప్రముఖులు.. వారి కుటుంబ సభ్యులు ఆ విమానంలో ప్రయాణించారు. ఒక రకంగా ఇది వీరికి పున:ర్జన్మ అనే చెప్పవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 హాలీవుడ్ స్టేజ్ పై టాలీవుడ్ సినిమా ఏదో తెలుసా ?

 పవన్ కళ్యాణ్‌ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్

ఖుషి మూవీ గురించి ఆ హీరో ఆసక్తికర పోస్ట్.. అది చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading