అరచేతిలో రేఖలను బట్టి వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో చెప్పే శాస్త్రాన్ని హస్త సాముద్రికం అంటారు. దీనిని అందరు నమ్మాలని ఏమీ లేదు. కానీ, సరదాగా మన చేతిలో గీతలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ ఆర్టికల్ లో చేతిలోని లవ్ లైన్ గురించి తెలుసుకుందాం.
Advertisement
అరచేతి బేస్ దగ్గర చిటికెన వేలు కింద మొదలై చూపుడు వేలు చివర వరకు కొనసాగే రేఖను లవ్ లైన్ లేదా హృదయ రేఖ అని పిలుస్తారు. ఈ రేఖ పొడవుగా ఉంటె.. వారు భావోద్వేగాలను బాగా ప్రదర్శించగలుగుతారని అర్ధం. వీరికి దయ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తులతో సన్నిహితంగా మెలుగుతారట. ఈ లైన్ చిన్నగా ఆ వ్యక్తులు తమ ప్రేమ విషయంలో రిజర్వ్డ్ గా ఉంటారని అర్ధం. వారు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే ప్రాక్టికల్ గా ఉండడం ముఖ్యం అనుకుంటారు. అదే ఈ లైన్ కొంచం వంకరగా ఉంటె వారు ఎక్కువగా ఆప్యాయతను చూపిస్తారు.
Advertisement
తమ ప్రేమను, ఇష్టాన్ని వెంటనే చూపిస్తూ ఉంటారు. నేరుగా సరళరేఖలా గీత ఉంటె.. వారు తమ భావోద్వేగాలను చూపడంలో నిగ్రహంగా ఉంటారు. తమ భాగస్వామికి కట్టుబడి ఉంటారు. లవ్ లైన్ కి పై భాగంలో చిన్న చిన్న గీతలు శాఖలుగా ఉంటె.. అవి ప్రేమ జీవితంలోని మైలురాళ్ళని చూపిస్తాయి. కొత్త సంబంధాలని కానీ, ఉన్న బంధాన్ని మరింత పదిలపర్చుకోవడం కానీ అయ్యుండొచ్చు. అదే లవ్ లైన్ కి క్రిందగా శాఖలు ఉంటె అవి ప్రేమ జీవితంలోని సవాళ్ళను చూపిస్తాయి.
మరిన్ని..
సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!
విక్టరీ వెంకటేష్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడా..?
ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న గోపీచంద్…కానీ !