Home » Tamanna: ఉపాసన అసలు ఏ డైమండ్ రింగ్ ఇవ్వలేదు… ఆ ఫోటో వెనుక అసలు విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు!

Tamanna: ఉపాసన అసలు ఏ డైమండ్ రింగ్ ఇవ్వలేదు… ఆ ఫోటో వెనుక అసలు విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన, తమన్నా భట్టియా ల గురించి ఓ వార్త తెగ వైరల్ అయినా సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా నటనని మెచ్చిన ఉపాసన ఆమెకు రెండు కోట్ల ఖరీదైన డైమండ్ రింగ్ ను తమన్నాకు గిఫ్ట్ గా ఇచ్చిందని ఈ వార్తల సారాంశం. ఈ డైమండ్ రింగ్ ప్రపంచంలోనే ఐదవ ఉన్నతమైనది అని కూడా ఈ వార్తల్లో రాసుకొచ్చారు. ఆ నోటా, ఈ నోటా పడి ఈ వార్త తమన్నా వరకు వెళ్ళింది. దీనితో తమన్నా ఈ రింగ్ విషయమై స్పందించారు.

tamanna

Advertisement

తమన్నా అసలు ఇది డైమండ్ రింగ్ కాదు అని చెప్పుకొచ్చారు. ఉపాసన తనకు ఎలాంటి రింగ్ ని గిఫ్ట్ గా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఉపాసన తమన్నా కు ప్రేమగా రింగ్ కొనిచ్చింది అన్న వార్తలకు తమన్నా చెక్ పెట్టేసారు. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. అసలు అది ఉంగరమే కాదని అసలు విషయం చెప్పి నవ్వేశారు. తమన్నా తన చేతికి సోడా బాటిల్ ఓపెనర్ ను పెట్టుకున్నారట. అది చూడడానికి చాలా బాగుండడంతో అలానే ఉంచి తమన్నా ఫోటోలు తీసుకున్నారట.

Advertisement

tamanna 1

ఈ ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి. దీనితో.. సరదా పడిన తమన్నా సోషల్ మీడియాలో తన అభిమానులతో ఈ ఫోటోలను పంచుకున్నారు. అయితే.. అసలు విషయం తెలియని నెటిజన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తూ రకరకాల కథలను అల్లేశారు. మరొకొందరైతే.. ఏకంగా ఉపాసన ఈ ఫోటోలు షేర్ చేసి తమన్నాని మెచ్చుకుంది అని కూడా రాసేశారు. మొత్తానికి ఈ వార్తలలో నిజం లేదని తమన్నా క్లారిటీ ఇచ్చేసారు.

మరిన్ని..

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading