మన ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా మనం ఎన్నో రకాల పండుగలను జరుపుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం చాలా విచిత్రమైన ఆచార సాంప్రదాయాలు, పండుగలు ఉంటాయి. ఆ ప్రాంతంలో భార్యలను మార్చుకునే పండుగ ఉందట. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా…! మరి అక్కడి ప్రాంతవాసులు భార్యలను మార్చుకునే పండుగను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం… ఈ పండుగ పేరు గిరేవాల్ ఫెస్టివల్.
Advertisement
ఈ పండుగను అమ్మాయిలు, అబ్బాయిలు చాలా సాంప్రదాయంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున అమ్మాయిలు, అబ్బాయిలు చాలా అందంగా తయారవుతారు. మంచి దుస్తులను ధరించి వారి పండుగను జరుపుకుంటారు. మగవారైతే ఇతరుల భార్యలను ఆకట్టుకోవడానికి చాలా మంచి దుస్తులను వేసుకొని చాలా అందంగా రెడీ అవుతారట. ఇలా మగవారిలో వారి దంతాలను బట్టి వారి అందాన్ని అంచనా వేస్తారట. వారి దంతాలు తెల్లగా ఉన్నట్లయితే వారు చాలా అందంగా ఉన్నారని భావించి వారిని ఎంచుకుంటారట. ఇక అబ్బాయిలు వారికి నచ్చిన అమ్మాయిలను ఎంచుకుంటారు.
Advertisement
ఇక అమ్మాయిలు వారి మొదటి భర్తని విడిచిపెట్టి వారికి పిల్లలు ఉన్నా సరే వారు ఎంచుకున్న రెండవ భర్తతో పిల్లలను తీసుకొని వెళ్ళిపోతారట. ఈ పండుగని ఆఫ్రికాలోని ఒక తెగకు చెందిన వారు చేసుకుంటారట. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలనేది ఏమీ లేదు. కేవలం భార్యలను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవారు మాత్రమే ఈ పండుగలో అందంగా తయారు అయ్యి పాల్గొంటారట. ఇక కొంతమంది మగవారు మాత్రం తమ భార్యలను మార్చుకోవడానికి ఇష్టపడకపోతే ఈ పండుగలో పాల్గొనేవారు కాదట.
ఇవి కూడా చదవండి
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!
వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?