సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నోరు ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు పేర్కొంటుంటారు. మరీ ముఖ్యంగా దంతాల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటారు. అయితే చాలా మంది దంతాల ఆరోగ్యంపై పెద్దగా ఎవ్వరూ దృష్టి పెట్టరు. ముఖ్యంగా బ్రష్ చేసే విషయంలో చాలా మంది అజాగ్రత్తగా ఉంటారు. అందుకే ప్రతీరోజు ఉదయం, రాత్రి పూట రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు.
Advertisement
ముఖ్యంగా పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే చపాతీలు, అన్నం వంటివి తీసుకున్న తరువాత నోట్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశముంది. ఇది దంతాలకు రక్షణగా నిలిచే తెల్లని పొరను దెబ్బ తీస్తుంది. అందుకే తిన్న తరువాత బ్రష్ చేసుకుంటే బ్యాక్టిరియాను పెరగకుండా చూసుకోవచ్చు. కానీ రాత్రి సమయంలో భోజనం చేసిన తరువాత పళ్లు తోముకోమని కొంత మంది దంత వైద్యులు సూచిస్తుంటారు. అయితే తిన్న వెంటనే బ్రష్ చేయడం కూడా మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి కారణం పుల్లని పదార్థాలలోని ఆమ్లం ఎనామిల్ పొరను బలహీన పరుస్తుంది.
Advertisement
అందుకే పుల్లని ఆహార పదార్థాలు తిన్న వెంటనే బ్రష్ చేస్తే.. దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతినే అవకాశముంటుంది. ఒకవేళ ఈ ఎనామిల్ దంతాలపై నుంచి తొలగిపోతే తిరిగి పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి పుల్లని పదార్థాలు తినడానికి ముందే పళ్లు తోముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తిన్న తరువాత నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉంచినట్టయితే సరిపోతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే ఆమ్లం ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా దంతాలపై శ్రద్ధ పెట్టి రోజుకు రెండుసార్లు శుభ్రపరుచుకుంటే మీ దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వాహనాల టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా..?
ఒక్క పాము కూడా కనిపించని దేశం ఏదో తెలుసా..? కారణం ఏంటంటే