Home » నటుడు సముద్రఖని డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సీరియల్ ఏదో తెలుసా..?

నటుడు సముద్రఖని డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సీరియల్ ఏదో తెలుసా..?

by Mounika
Ad

 ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు సముద్రఖని. తెలుగులో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నా కూడా అల్లు అర్జున్  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన  అలవైకుంఠపురములో  సినిమాలో  అప్పలనాయుడు పాత్రతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో సముద్రఖని విలన్‌గా ఉంటే హీరోయిజం మరింత ఎలివేట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సముద్రాఖని పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించడానికి మరో కారణం ఉంది.   పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. 

Advertisement

 ఏంటి ఈయన యాక్టర్ కదా.. డైరెక్టర్ అని చెప్తున్నారు అని  ఆశ్చర్యపోతున్నారా.. ఇప్పుడు అదే విషయంలోకి వెళ్తున్నాం.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో చిత్రం  మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మొత్తం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హీరో సాయి ధరమ్ తేజ్ సముద్రఖని గురించి ఎవరికి తెలియని  ఓ ఆసక్తికరమైన విషయాన్నీ తెలియజేశారు.

Advertisement

 ఇంతకీ ఆ విషయం ఏమిటంటే  సముద్రఖని కేవలం సినిమాలకు మాత్రమే కాదు, కొన్ని మెగా బ్లాక్ బస్టర్ హిట్ సీరియల్స్ కి కూడా దర్శకులుగా పనిచేశారు. 1999లో జెమినీ టీవీలో ప్రసారమయ్యే  ‘పిన్ని’ అనే సీరియల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అమ్మమ్మల్ని, అమ్మల్ని 1990’s కిడ్స్ని అడిగి తెలుసుకోవచ్చు. అప్పటిలో ఈ  సీరియల్ వస్తుందంటే చాలు టీవీల ముందు టైం ప్రకారం వాలిపోయేవారు.  ఈ సీరియల్స్ రెండు భాగాలుగా, సుమారుగా 3000 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సీరియల్ లో సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్ రాధిక ప్రధాన పాత్ర పోషించారు.

ఈ సీరియల్ మొదటి భాగం పేరు పిన్ని , రెండవ భాగం పేరు ఝాన్సీ. ఇందులో రాధిక ద్విపాత్రాభినయం నటించారు. అప్పటిలో అంత ఘనవిజయాన్ని సాధించిన ఈ సీరియల్స్ కి  సముద్రఖనినే  దర్శకత్వం వహించారని  ఇంటర్వ్యూ ద్వారా సాయి ధరమ్ తేజ్ తెలియజేశారు.  సముద్ర ఖని తెలుగులో రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కాంబినేషన్ లో ‘శంభో శివ శంభో’ అనే చిత్రంతో దర్శకుడుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా, మంచి చిత్రంగా ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉండిపోయిన హీరోయిన్స్ !

వరుణ్ సందేశ్ భార్య వితికా షేర్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఛార్మి రెమ్యూనరేషన్ తీసుకొని ప్రమోషన్స్ కి ఎగ్గొట్టాలని చూసింది.. జయసుధ న్యాయం చేసింది..!

 

Visitors Are Also Reading