ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు చాలా కామన్ గా ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మంచి రోజులు వస్తాయి అని ధైర్యంతో ముందుకు వెళ్తే కచ్చితంగా మనం అనుకున్నది పూర్తవుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకు దురదృష్టమే కలుగుతుంది. మనం అనుకున్నది ఏదీ కూడా జరగదు. ఎప్పుడు ఆటంకాలే వస్తూనే ఉంటాయి. నిజానికి ఒకసారి శని కనుక తగిలిందంటే ఎలాంటి పని కూడా జరగదు.
Advertisement
అనుకున్న పనులు ఏమీ కూడా శని కారణంగా పూర్తికావు. అయితే శని ప్రభావం మన మీద పడటం వలన మనకి దురదృష్టమే కలుగుతుంది. కానీ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు. శని దేవునికి కనుక కోపం వస్తే మనల్ని నాశనం చేస్తాడు. శని కూడా రాశుల వారిగా ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుండి మరొక రాశికి శని రావడానికి రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది. కొంతమందికి శని వలన మంచి జరిగితే… కొంతమందికి మాత్రం కఠినంగా ఉంటుంది. శని కారణంగా శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిట్లో కూడా అంతరాయం కలుగుతుంది.
Advertisement
అయితే శని నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… వీటిని ఆచరిస్తే అంత సంతోషమే కలుగుతుంది. శుభం జరుగుతుంది. జీవితంలో సమస్యలు ఎదురవుతుంటే శనివారం లేదా సోమవారం రోజున గంగాజలంతో కడిగిన సత్ముఖి రుద్రాక్షను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లో సమస్యలన్నీ పోతాయి. పురాణాల ప్రకారం శని దేవుడు హనుమంతుని భక్తులను ఇబ్బందిపెట్టడు. శనివారం హనుమంతుడిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి. శనివారం రావి చెట్టును పూజిస్తే శని బాధల నుండి బయటపడవచ్చు. శనివారం ఆవనూనె దీపాన్ని రావిచెట్టు దగ్గర వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుంది. శనివారం రోజున శని మంత్రాలని జపిస్తే కూడా ఈ బాధలు ఉండవు.
ఇవి కూడా చదవండి
MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్