కలలు కనడం సహజం. మనం నిద్రపోయాక, ఎక్కువగా వేటి గురించి ఆలోచిస్తూంటామో అవే మన కలలోకి వస్తూ ఉంటాయి. అయితే.. కొందరికి మంచి కలలు వస్తూ ఉంటాయి. మరికొందరికి భయం గొలిపే కలలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా.. కొన్ని కలలు మాత్రం మనకు జీవితం గమనంలో మార్గనిర్దేశం చేయడం కోసమే వస్తూ ఉంటాయి. అలాంటి కలలకి అర్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం… కలలో మనకి కుంకుమ కనబడితే అదృష్టం, కీర్తి కలుగుతుంది. ఒకవేళ వంటగది కనుక కనబడినట్లైతే అప్పుల నుండి విముక్తి కలుగుతుందని అర్ధమట.
Advertisement
గుర్రపు స్వారీ చేసినట్లు కనుక కలలో వస్తే చేసే పనిలో విజయం లభిస్తుందని, పుస్తకాలూ కలలో కనిపిస్తే మానసిక వికాసం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. దీపం కలలో కనపడితే కుటుంబంలో ఆనందం కలుగుతుందట. ఇలా కలలకు అర్ధం ఏదైనా.. కొన్ని తెల్లవారు జామున వచ్చే కలలు నిజంగానే జరిగి తీరుతాయని విశ్వాసం చాలా మందిలో ఉంది.
Advertisement
ఉదయిస్తున్న సూర్యుడు లేదా పున్నమి చంద్రుడు కలలో కనిపిస్తే.. త్వరలో డబ్బు చేతికి అందుతుంది అని అర్ధమట. మనుషుల మలం కనిపించినా మరుసటి రోజు ఎదో ఒక రూపంలో డబ్బు అందుతుందని నమ్ముతుంటారు. అలాగే బంగారం ధరించినట్లు, జుట్టూ రాలుతున్నట్టు, బంగారం ధరించినట్టు , ఆవు పాలు ఇస్తున్నట్లు కలలో కనిపిస్తే వారు కోటీశ్వరులవుతారట. వారిపై లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుందట.
ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!
డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?
టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?