Home » అత్యధిక ట్యాక్స్ చెల్లించే బీటౌన్ భామ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

అత్యధిక ట్యాక్స్ చెల్లించే బీటౌన్ భామ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు, హీరోలతో ధీటుగా తమ యాక్టింగ్ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే హీరోలతో పోల్చితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వివక్ష తప్పడం లేదు. నటనతో పాటు ఎంటర్ టైన్ మెంట్స్, యాడ్స్ ద్వారా భారీ ఆదాయాన్నేఅర్జిస్తున్నారు. ఈ తరుణంలో అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రూ.500 కోట్ల విలువ దీపిక పదుకునే బాలీవుడ్ ఉమెన్ సెల్రబిటీల్లో టాప్ టాక్స్ పేయర్ గా నిలుస్తోంది.

Advertisement

బాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీలు  సినిమాలు చేయడంతో పాటు.. పలు రకాలుగా వ్యాపారాల్లో నిమగ్నమై భారీ ఆదాయాన్నే అర్జిస్తున్నారు. దేశంలో అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో ఉంటున్నారు. హీరోయిన్లు ఇందులో తోటివారితో ప్రత్యేకంగా నిలుస్తోంది దీపికా పదుకొనే. దీపికా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించిందట. ఇదే పరపరంలో తరువాత ఏడాది కొనసాగుతుందని బహుళ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. గత ఏడాది అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ దీపికా పదుకునే. సంపాదన ఏడాదికి రూ.40కోట్లు. ఒక్కో మూవీకి దాదాపు రూ.15కోట్లు వసూలు చేస్తోంది. ఎండార్స్ మెంట్ ల కోసం 7-10 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

ఫోర్బ్స్  ఇండియా ప్రకారం.. దీపిక ప్రధాన ఆదాయ వనరు ఎండార్స్ మెంట్. 2019లో 48 కోట్ల వరకు సంపాదించింది. పద్మావతి మూవీ కోసం ఏకంగా రూ.12 కోట్లు వసూలు చేసిందని బీటౌన్ టాక్ వినిపిస్తుంది.  అంతేకాదు.. అదే ఏడాది రోహిత్ శర్మ, అజయ్ దేవగన్, రజినీకాంత్ వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి అత్యధిక నికర విలువ కలిగిన టాప్ 10 భారతీయ సెలబ్రిటీల్లోకి ప్రవేశించిన విషయం విధితమే. ఈ రేంజ్ లో ట్యాక్స్ చెల్లించిన వారిలో దీపికా పదుకునే టాప్. గతంలో కత్రినా ఈ ప్లేస్ లో కొనసాగింది. 2013-14లో రూ.5కోట్లకు పైగా పన్నులు చెల్లించింది. రూ.10కోట్ల మార్కుకు చేరుకున్నప్పటికీ ఈ లిస్ట్ లో ఆలియాభట్ రెండో స్థానంలో నిలిచింది. ఏడాదికి రూ.5 నుంచి 6 కోట్ల వరకు పన్నులను చెల్లిస్తున్నట్టు సమాచారం. భారతీయ మహిళా సెలబ్రిటీల్లో ధనవంతులు అయిన హీరోయిన్ల లిస్ట్ లో దీపికా రెండో స్థానంలో ఉంది. ప్రియాంకా చోప్రా జోనాస్ నెట్ వర్త్ రూ.620 కోట్లు, కరీనా కపూర్ దాదా రూ.485 కోట్లు అన్నమాట.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రాజ‌మౌళి కెరీర్‌లో న‌ష్టాలు తెచ్చిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?

Samantha : సమంత చెప్పుల ఖరీదు అంతా.. ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

Visitors Are Also Reading