Chanikya niti : చాణక్య నీతి అనేది ఆచార్య చాణక్యుడు రచించిన జీవిత విధాన గ్రంథం. ఈ నీతి శాస్త్రం వివిధ విషయాలపై బోధించడంతో పాటు సరైన మార్గదర్శకత్వం కూడా ఇస్తుంది. ఆచార్య చాణక్య యొక్క నీతి వ్యక్తిగత, సామాజిక మరియు రాజకీయ జీవితానికి సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తుంది. ఈ నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన సూత్రాలు మరియు విధానాలు ఉన్నాయి. ఇవి విజయం వైపు వ్యక్తికి దిశానిర్దేశం చేస్తాయి.
Advertisement
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క కొన్ని అలవాట్ల గురించి వెల్లడించారు. ఒక వ్యక్తిలో ఈ లక్షణాలే అతనిని క్రమంగా పేదవాడిగా మారుస్తాయి. మనిషి జీవితం సంతోషంగా సక్రమంగా నడపాలి అంటే ఈ చెడు అలవాట్లను వదిలేయాలి. మనిషిని పేదవాడుగా మార్చే ఆ చెడు అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
#1. శుభ్రత లేకపోవడం:
ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఎవరు మురికిగా ఉండి, శుభ్రమైన బట్టలు ధరించరు లేదా తమ చుట్టూ అశుభ్రమైన వాతావరణంలో ఏర్పరచుకుంటారో అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ పేదరికంతో జీవిస్తారు.
#2. అబద్ధాలు చెప్పటం :
Advertisement
తమ అవసరాల కోసం ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చెప్పి కాలాన్ని గడుపుతారో అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రానివ్వకూడదు అని చాణక్యుడు చెప్పాడు. తల్లి లక్ష్మి కూడా అలాంటి వారిని ఎప్పుడూ సంతోషించదు. అందుకే అసత్యాలు మాట్లాడే అలవాటును వెంటనే వదిలేసి ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడాలి.
#4. సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడం :
చాణక్యుడు నీతి ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నిద్రించే వారు ఎల్లప్పుడూ పేదలుగా ఉంటారు. ఈ సమయంలో నిద్రించే వారిపై ఇప్పుడు కూడా లక్ష్మి అనుగ్రహం ఉండదు. అందుకే పొరపాటున కూడా సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు.
#4. సోమరితనం:
సోమరితనం అనేది ఒక చెడు అలవాటు అని.. ఇది ఒక వ్యక్తిని చేసే పనిలో విజయానికి అడ్డంకుగా ఉంటుందని చాణక్య నీతి చెబుతుంది . జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా సోమరితనాన్ని వదులుకోవాలని చాణిక్యుడు తన నీతి ప్రకారం వెల్లడిస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఇలాంటి వస్తువులను కింద పెడితే లక్ష్మీదేవికీ కోపం వస్తుందట..!!
శుక్రవారం నాడు మాత్రం అస్సలు ఈ పొరపాట్లని చెయ్యకండి.. డబ్బులన్నీ పోతాయి..!
ఇంట్లో డబ్బులు అస్సలు ఉండటంలేదా? బీరువా ఆ దిశలో పెట్టండి.. ఆపై లక్ష్మీకటాక్షం !