Home » Sourabh: 13 ఏళ్ళు టీం ఇండియాకు దూరం.. కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సౌరభ్ తివారి గురించి ఈ విషయాలు తెలుసా?

Sourabh: 13 ఏళ్ళు టీం ఇండియాకు దూరం.. కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సౌరభ్ తివారి గురించి ఈ విషయాలు తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు పుదుచ్చేరి లో దేవధర్ ట్రోఫీ-2023 ఇంటర్-జోనల్ వన్డే క్రికెట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లకు సౌరభ్ తివారి కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించనున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత దేవధర్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుంది. 13 ఏళ్లుగా ఇండియా తరపున ఒక్క ఆట కూడా ఆడని సౌరభ్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యపరిచే విషయమే. అయితే.. ఈ ఆటగాడు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో కూడా ఓటమిని చూడలేదు.

sourabh

Advertisement

అక్టోబర్ 20, 2010న ఆస్ట్రేలియా పై జరిగిన వన్డే మ్యాచ్ తో సౌరభ్ అరంగ్రేటం చేసారు. చాలా చిన్న ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడడంతో సౌరభ్ ఆ మ్యాచ్ కి హీరోగా నిలిచారు. ఇప్పటి వరకు ఇండియా తరపున సౌరభ్ 3 ఆటలు ఆడారు. ఈ 3 వన్డేల్లో 49 పరుగులు చేశాడు. సౌరభ్ ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌లు ఆడారు. వీటిల్లో సౌరభ్ మొత్తంగా 1494 పరుగులు చేసారు.

Advertisement

sourabh

సౌరభ్‌కి అరంగేట్రం మ్యాచ్‌ ఎప్పటికి మరుపురానిదిగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్లకు 289 పరుగులు చేయగా.. భారత్ నే విజయం సాధించింది. ఈ విజయంలో సౌరభ్ కీలక వ్యక్తిగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో సౌరభ్ 17 బంతుల్లో 12 నాటౌట్‌గా నిలిచారు. సౌరభ్ బ్యాటింగ్ కు వచ్చిన టైం లో ఇండియా కీలకమైన పొజిషన్లో ఉంది. సౌరభ్ నిరాశపడలేదు. సురేష్ రైనాతో కలిసి భారత్ ను గెలిపించారు.

మరిన్ని..

పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading