Home » నిహారిక విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి?

నిహారిక విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి?

by Bunty
Ad

టాలీవుడ్ అలనాటి హీరోయిన్.. సదా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంతమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ… ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది హీరోయిన్ సదా. అప్పుడెప్పుడో హీరో నితిన్ నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టింది హీరోయిన్ సదా. ఈ సినిమా.. అటు హీరో నితిన్ అలాగే హీరోయిన్ సదా కు మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. టాప్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక అపరిచితుడు సినిమాలో సదా చేసిన యాక్టింగ్ అదరహో అనిపిస్తుంది. అయితే 39 సంవత్సరాలు అయినప్పటికీ ఈ బ్యూటీ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి అనే మాట ఎత్తితే ఆమడ దూరంలో ఉంటుంది సదా. అయితే తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ సదా. పెళ్లి చేసుకుంటే తనకు ఫ్రీడం పోతుందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తనకు జంతువులంటే చాలా ఇష్టమని… నేను ఎటు పోవాలనుకుంటే అటు వెళ్తానని వెల్లడించింది.

Advertisement

కానీ పెళ్లి జరిగితే తన ఫ్రీడమ్ పూర్తిగా పోతుందని చెప్పుకొచ్చింది హీరోయిన్ సదా. అలాగే నిహారిక విడాకులు తీసుకోవడం పై కూడా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ సదా. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..బోరు కొట్టిన తర్వాత విడాకులు తీసుకుంటున్నారు..ఎక్కువ ఇండస్ట్రీలోకూడా విడిపోవడం చూస్తున్నామని చెప్పుకొచ్చింది సదా. దీంతో ఈ కామెంట్స్‌ విన్న నెటిజన్లు… నిహారిక విడాకులను ఉద్దేశించే… సదా ఈ కామెంట్స్‌ చేసిందని కామెంట్స్‌పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading