టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటీనటులకు అస్సలు కొదవలేదు. అయితే కెరీర్ ప్రారంభంలో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై… నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు చేసి… మంచి పేరు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్.
Advertisement
అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదా అంశం తెరపైకి తీసుకువచ్చి.. నిత్యం వార్తలన్నీ ఇస్తూ ఉంటాడు బండ్ల గణేష్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ… నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు బండ్ల గణేష్. అటు… ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బండ్ల గణేష్ ఆసుపత్రి పాలయ్యాడని తెలుస్తోంది.
Advertisement
బండ్ల గణేష్ ఓ ఆసుపత్రిలో బెడ్ పై, సెలైన్ తో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో బండ్ల గణేష్ చేరినట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ కు వైరల్ ఫీవర్ సోకినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆస్పత్రిలో చేరినట్లు ఫోటో వైరల్ కావడంతో… బండ్ల గణేష్ కు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనిపై స్వయంగా బండ్ల గణేష్ క్లారిటీ ఇస్తే తప్ప… అసలు ఏం జరిగిందో తెలియదు.
ఇవి కూడా చదవండి
మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్
ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్