Home » మ‌హేష్‌బాబు గురించి త్రివిక్ర‌మ్ ఏమ‌న్నారంటే..?

మ‌హేష్‌బాబు గురించి త్రివిక్ర‌మ్ ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో చాలా ఏండ్ల క్రితం అత‌డు, ఖ‌లేజా సినిమాలు తెర‌కెక్కాయి. ఈ కాంబినేష‌న్ మ‌రొక సినిమా ఫిక్స్ కాగా.. త్వ‌ర‌లో ఈ సినిమా మూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ది. అత‌డు, ఖ‌లేజా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కాక‌పోయినా త్రివిక్ర‌మ్ మ‌హేష్‌బాబును కొత్త‌గా చూపిస్తారు అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మ‌హేష్ త్రివిక్ర‌మ్ కాంబోలో సినిమా తెర‌కెక్క‌నున్న‌ది.

Tollywood celebs mourn untimely demise of Mahesh Babu's elder brother Ramesh  Babu | Telugu Movie News - Times of India

Advertisement

మ‌హేష్‌కు కొవిడ్-19 సోకడంతో అంత్య‌క్రియ‌లకు హాజ‌రు కాని మ‌హేష్‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన ఎమోష‌న‌ల్ ట్వీట్ నెట్టింట వైర‌ల‌వుతోంది. నువ్వే నా ఆద‌ర్శం.. నువ్వే నా ధైర్యం.. నువ్వే నా బ‌లం. నా కొర‌కు నువ్వు చేసిన ప్ర‌తీ ప‌నికి కృత‌జ్ఞ‌త‌లు, నువ్వు లేక‌పోతే నేను స‌గం మాత్ర‌మే ఉన్న‌ట్టు ఇక నుంచి నువ్వు కేవ‌లం విశ్రాంతి తీసుకో.. నిన్ను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను. మిస్ అవుతున్నాను అన్న‌య్య అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు.

Advertisement

Mahesh Babu pens an emotional note mourning the demise of his elder brother Ramesh  Babu | Hindi Movie News - Times of India

గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ర‌మేష్‌బాబుపై మ‌హేష్ బాబుకు ఎంత అభిమాన‌మో త్రివిక్ర‌మ్ చెప్పుకొచ్చారు. ఖ‌లేజా సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఫోన్ కాల్ మాట్లాడిన త‌రువాత మ‌హేష్‌బాబు దిగులుగా ఉన్నార‌ని, ఏమి జ‌రిగింద‌ని అడిగితే ర‌మేష్‌బాబు జ్వ‌రంతో బాధ ప‌డుతున్నార‌ని మ‌హేష్‌బాబు చెప్పార‌ని త్రివిక్ర‌మ్ చెప్పుకొచ్చారు. షూటింగ్ ఆపేద్దాం అని తాను చెప్పినా భారీ బ‌డ్జెట్ మూవీ కావ‌డంతో బాధ‌తోనే మ‌హేష్ షూటింగ్ లో పాల్గొన్నారు అని త్రివిక్ర‌మ్ చెప్పారు. షూటింగ్ పూర్త‌యిన తరువాత మ‌హేష్‌బాబు వెంట‌నే ఆసుపత్రిలో ఉన్న ర‌మేష్‌బాబును చూడ‌డానికి వెళ్లారు అని త్రివిక్ర‌మ్ వివ‌రించారు. ర‌మేష్ బాబు మ‌హేష్ బాగోగుల‌ను చూసుకున్నారు అని ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని షాకింగ్ విష‌యాల‌ను త్రివిక్ర‌మ్ చెప్పుకొచ్చారు. షూటింగ్ లొకేష‌న్ కూడా ర‌మేష్ బాబు మ‌హేష్‌బాబు ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు అని స‌మాచారం. హీరోగా ర‌మేష్‌బాబు న‌టించిన సినిమాలు ఎక్కువగా ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు.

Visitors Are Also Reading