టాలీవుడ్‌లో ఇప్పుడు రష్మిక మందన్న టాప్‌లో దూసుకుపోతున్న హీరోయిన్. ప్రస్తుతం ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ హాట్ బ్యూటీ. ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది కన్నడ సోయగం. క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది.
ఇటీవల ఐకాస్ స్టార్ అల్లుఅర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించిన ఈ భామ తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాన్ ఇండియా విడుదలైన ఈ చిత్రంలో శ్రీవల్లిగా పుష్పరాజ్‌నే కాకుండా ప్రేక్షకులందరి మదిని దోచేసింది ఈ బ్యూటీ. శ్రీవల్లి పాత్రలో తను చేసిన పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. అల్లుఅర్జున్ వచ్చే సన్నివేశాల్లో అమ్ముడు నటించిన సీన్స్ అయితే కేక పెట్టించాయి. ఈ తాజాగా అమెజాన్ ఫ్రేమ్‌లో స్ట్రీమింగ్ అయింది. మరొకసారి టీవీల్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు బన్నీ అభిమానులు.
Advertisement
Advertisement
పుష్ప సినిమా చివరలో నటీనటులు పేర్లు వేస్తారు అని ప్రతీ సినిమా ప్రేక్షకుడికి తెలుసు. అయితే ఆ టైటిళ్లో రష్మిక మందన్నాకు బదులు రష్మిక మడోనా అని తప్పుగా వేసారు. దీంతో మన నెటిజన్లు నెట్టింట ఆస్క్రీన్ షాట్‌తో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. తెలుగులో తప్పు వచ్చిందంటే అంతగా ఎవ్వరూ పట్టించుకోలేకపోయారేమో. కానీ ఇంగ్లీషులో పెద్ద అక్షరాలతోనే రష్మిక మందన్న పేరు తప్పుగానే వచ్చింది రష్మిక మందన్న పేరు మడోనా గా మారిపోయినదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇస్ట్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.