సాధారణంగా నాగయ్య గారు గురించి సినీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలియదు. కానీ చిత్తూరు వి.నాగయ్య గారు అంటే చాలు.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ కి తప్పకుండా తెలిసి ఉండి తీరుతుంది. ఎన్టీఆర్-ఏఎన్నార్ ఇండస్ట్రీకి రాకముందే నాగయ్య గారు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా కొనసాగారు. వరుసగా విజయవంతమైన సినిమాలతో సినీ ఇండస్ట్రీని ఏలారు. హీరో అనే పదాన్ని జోడించటం ఆయనకు అవమానకరమే అవుతుంది. హీరోలు అంటే కేవలం కొన్ని రకాల పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ చిత్తూరు వి.నాగయ్య గారు హీరోగా, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా, భక్త పోతనగా, వేమనగా ఇలా రకరకాల పాత్రలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కంటే ముందే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు నాగయ్య. కానీ చివరి రోజుల్లో మాత్రం దుర్భర జీవితాన్ని గడిపాడు. ఆసుపత్రికి వెళ్లడానికి కూడా డబ్బులు లేక దుర్భర జీవితాన్ని గడిపి అప్పులు చేసిన పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయల ఆస్తిని కూడగట్టిన ఆయన చివరి రోజుల్లో ఎందుకు అలాంటి దుర్భర జీవితాన్ని గడిపారు? ఆయన చనిపోవడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఏం జరిగింది. ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు.. సినీ ఇండస్ట్రీకి ఓ గుణపాఠాన్ని ఎలా నేర్పించారు అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
చిత్తూరు జిల్లాలోని గోగులూరు గ్రామంలో మార్చి 28, 1904న జన్మించారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాల్యం పాటలు పాడటం అలవాటు అయింది. సురభీ నాటకం వారు భక్తప్రహ్లద నాటకం ప్రదర్శించడానికి వచ్చారు. స్కూల్ హెడ్ మాస్టర్ వేశం వేయించారు. ఆ సమయంలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో బ్రాహ్మణ కుటుంబంలో నాటకం అనేది చెడు వ్యసనంగా భావించేవారు. దీంతో నాయగయ్యని తిరుపతికి పంపించారు. ఆయన అక్కడ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పిల్లలకు నాటకాలపై ఆసక్తి కలిగించేలా నేర్పించారు. ఈ తరుణంలో విమర్శలు కూడా ఎదుర్కున్నారు. ఓవైపు తండ్రి, మరోవైపు భార్య మరణాలు నాగయ్యని బాగా కుంగదీశాయి. అయినప్పటికీ అవేమి పట్టించుకోకుండా మెల్లగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
Advertisement
ముఖ్యంగా భక్త రామదాస్ సినిమాలో రెండు పాటలు అందరి ప్రశంసలు అందుకున్నారు. గృహలక్ష్మీ సినిమాలో గోపినాథ్ అనే యువకుడి పాత్రలో నటించాడు. వందేమాతరం సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు. మరోవైపు ఈ సినిమాకి నాగయ్య గారే సంగీతాన్ని సమకూర్చడం విశేషం. దేవదాస్ సినిమాలో విలన్ గా, కొన్ని సినిమాల్లో హాస్య పాత్రల్లో నటించాడు. తన విలక్షణమైన నటనకు బీ.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహమే కారణం అని నాగయ్య చెప్పారట. భక్త పోతన, త్యాగయ్య, యోగి వేమన, రామదాస్ చిత్రాలు నాగయ్య కెరీర్ ని మలుపు తిప్పాయనే చెప్పాలి. అప్పట్లో వరుసగా 10 విజయవంతమైన చిత్రాల్లో నటించి అందరి కంటే అత్యధిక పారితోషికం తీసుకొని ఖరీదైన కార్లలో తిరిగారు. లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న నాగయ్య.. చివరి రోజుల్లో కేవలం వందల రూపాయాల్లో పారితోషికం కూడా తీసుకున్నారు. తాను చాలా సార్లు మోసపోయానని.. అందరినీ నమ్మి మోసపోకండి అని పలువురికి సూచించాడట నాగయ్య. డాక్టర్ల సూచన మేరకు ఘన ఆహారాన్ని మానేసి.. కేవలం ద్రవపదార్థాలపైనే ఆధారపడి ఉన్న సమయంలో డాక్టర్ల దగ్గరికీ ఆయనను తీసుకెళ్లడం కోసం ఆయన భార్య జయమ్మ అతి కష్టం మీద పాతిక రూపాయలను సంపాదించింది.
డాక్టర్ వద్దకు తీసుకెళ్దామని తయారవుతుండగా.. ఆయనను చూడటానికి ఓ దూరపు బందువు వారి ఇంటికి వచ్చాడు. నాగయ్య ఆయనను ఆదరించి ఆప్యాయంగా మాట్లాడి లోపలికి నేను బాగానే ఉన్నానని.. నాకు ఇప్పుడిప్పుడే ఏమి కాదు. మన ఇంటికి వచ్చిన అతని పరిస్థితి ఏమి బాలేదు.. మన ఇంటికి వచ్చిన వ్యక్తికి నీ దగ్గర ఉన్న పాతిక రూపాయలు ఇచ్చి పంపిద్దామని భార్యతో చెప్పాడట నాగయ్య. జయమ్మ కూడా ఆయన చెప్పినట్టే చేశారు. నాగయ్య చివరి దశలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. మృత్యుదేవతో పోరాడుతున్న నాగయ్య వద్దకు ఆయన మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇందూరు వెంకటేశ్వరరావు గారు వారు ఆయన పక్కనే నిలుచొని రఘుపతి రాజారామ్ గీతం పాడుతుండగా అది వింటూనే ఆయన డిసెంబర్ 30, 1973న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన మరణం తరువాత ఆయన కోరుకున్నట్టుగా తెలుగు సినిమా నటీనటులు విరాళాలతో అంత్యక్రియలు జరిగాయి. మద్రాస్ లో నటరాజ నాగయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి వీ.వీ.గిరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1965లో భారతప్రభుత్వం నాగయ్యకి పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. దక్షిణ భారతదేశంలోనే పద్మ శ్రీ అవార్డు అందుకున్న మొదటి నటుడు నాగయ్య గారే కావడం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సలార్ టీజర్ లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరు..?
Salar: సలార్ కు కెజిఎఫ్ క్లైమాక్స్ కు సంబంధం ఉందా? సలార్ టీజర్ లో ఇది గమనించారా?
రజినీకాంత్ తరువాత అల్లు అర్జునే.. ఆ టాలీవుడ్ నటుడు ఏమన్నాడంటే..?