మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా రిపబ్లిక్. ఈ సినిమా విడుదల సమయంలో సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Advertisement
దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకున్నారు. ఆయనే చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శల జల్లు కురిపించారు. దాంతో అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
టికెట్ల సమస్య అనేది ఇప్పుడే వచ్చింది కాదని అన్నారు. చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యే అని తెలిపారు. కోర్టుల వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. జీవో నెంబర్ 35 కూడా అలాంటిదేనని అన్నారు. పుండు పుడితే మందు వేయాలి కానీ దాన్ని నరికితే ఇదిగో ఇలానే అవుతుంది అంటూ కామెంట్ చేశారు. నీకు ప్రభుత్వం అంటే ఇష్టం లేదని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్లు నీ కంటే ఎక్కువ తిడతారని వ్యాఖ్యానించారు. వాళ్లు వీళ్లు తిట్టుకుని ఇండస్ట్రీ కొంపముంచారు అంటూ తమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ సినిమా ఈవెంట్ కు వచ్చి టికెట్ల ఇష్యూపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించారు. ఆయన అక్కడ మాట్లాడటం వల్ల ఇండస్ట్రీకి ఏమీ లాభం లేదని రిపబ్లిక్ సినిమాకు నష్టం వచ్చిందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. రిపబ్లిక్ అందరూ చూడాల్సిన సినిమా అని ఆ సినిమా ఫంక్షన్ కు వెళ్లి అధికారం లో ఉన్న వైసీపీ ని తిడితే నష్టమే కదా అని వ్యాఖ్యానించారు.
Advertisement
వైసిపి అధికారంలో ఉందని మొత్తంగా 53 శాతం ఓటర్లు ఆ పార్టీకి వచ్చాయని అందులో పది శాతం మంది ఈ సినిమా చూడటం మానేసినా సినిమాకు నష్టం అని వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ ఫస్ట్ డే రిజల్ట్ ఎంత బ్యాడ్ అంటే… సాయి ధరమ్ తేజ్ సినిమా కి విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చేవని కానీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా రాకుండా పోయాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడటం వల్ల రిపబ్లిక్ సినిమా పోయిందని అనవసరంగా మంచి సినిమాను పవన్ కళ్యాణ్ చంపేశారని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.