Home » రాజమౌళి తన కెరీర్లో ఇలాంటి అవమానం పొందారా? తన మొదటి సినిమా రిలీజ్ అయ్యాక..?

రాజమౌళి తన కెరీర్లో ఇలాంటి అవమానం పొందారా? తన మొదటి సినిమా రిలీజ్ అయ్యాక..?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఓ లెవెల్ లో బజ్ ఉంటుంది. రెండు మూడేళ్ళ ముందు నుంచే గాసిప్స్ మొదలైతే.. షూటింగ్ కి రెండేళ్ల టైం, ఇంకా టెక్నికల్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కలుపుకుని మరో ఏడాది చేసినా చేస్తారు. అయితే.. ఎంత లేట్ అయినా జక్కన్న ఎంట్రీ మాత్రం లేటెస్ట్ గా ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ హిట్ అయిన తరువాత జక్కన పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగారు. అయితే.. రాజమౌళి తన కెరీర్ ప్రారంభంలో అవమానాలు ఎదుర్కొన్నారు.

Advertisement

రాజమౌళి డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేసారు. ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేసినప్పటికీ.. సక్సెస్ క్రెడిట్ మాత్రం రాఘవేంద్ర రావుకే దక్కింది. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ వలన సినిమా హిట్ అయిందని ప్రచారం జరిగింది. ఈ సినిమా తరువాత జక్కన్న మళ్ళీ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా చేసారు.

Advertisement

ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఇటు రాజమౌళి, అటు ఎన్టీఆర్ ఇద్దరి జీవితాల్లోనూ కీలక మలుపు తీసుకుంది. ఈ సినిమా తరువాత ఇద్దరు తమ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎన్టీఆర్, రాజమౌళిల ఆఫ్ స్క్రీన్ బాండింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ బాండింగ్ వారి కెరీర్ ప్రారంభం నుంచే మొదలైంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Visitors Are Also Reading