సాధారణంగా మనం ఉదయం నిద్ర లేవగానే వాసన కలిగిన కాఫీ తాగడం జరుగుతుంటుంది. అయితే కాఫీ త్రాగడాన్ని ఒక అరగంట వాయిదా వేసి కేవలం నిమ్మరసం తాగడం చాలా మంచిది. క్యాన్సర్ కణాలను చంపే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. కానీ మానవ శరీరంలో ఆల్కలీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే అది చాలా ఉత్తమంగా పని చేస్తుంది. ఆమ్ల పండుగా ప్రసిద్ధి చెందిన నిమ్మకాయను గొప్ప ఆల్కలీన్ ఏజెంట్ గా చెప్పవచ్చు. నిమ్మరసం తాగినప్పుడు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గుతాయి. ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఎసిడిక్ గా ఉన్నప్పుడు చర్మం యొక్క Ph స్థాయిలను తగ్గించడానికి నిమ్మకాయ నీరు సహాయపడుతుంది.
Advertisement
విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టిరియల్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి మరమ్మత్తు కోసం, మెగ్నీషియం ఫాస్పరస్ ఎముకలు, దంతాల బలం కోసం సహాయపడుతాయి. అలాగే.. లివర్ శరీరంలో నిర్విషీకరణ చేసే ప్రధాన అవయవం. కాబట్టి శరీరంలో ప్రోటీన్, జీర్ణక్రియకు అవసరమైన జీవ రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. నిమ్మకాయ నీరు, కాలేయ నిర్విషీకరణ చేసే ఎంజైమ్ లు సంఖ్యను పెంచుతుంది. కాలేయం దాని బాధ్యతలను మరింత ప్రతిభవంతులుగా నిర్వహిస్తుంది. అంతేకాదు.. నిమ్మమంచి మలబద్ధక నివారణిగా పని చేస్తుంది. దీంతో శరీరం శుద్ధి జరిగి మూత్రవిసర్జన రేటు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
Advertisement
ప్రతీ రోజు నిమ్మకాయ రసాన్ని వినియోగిస్తే.. ముడతలు తగ్గి చర్మం లుక్ తో ఉండటానికి సహాయపడుతుంది. నిమ్మకాయ శరీరంలోని విషాలను బయటికి పంపించడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. నిమ్మకాయ ముడుతల చికిత్స మరియు చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి చౌక అయిన చాలా వరకు అందుబాటులో ఉండే నివారిణి అని చెప్పవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండుట వల్ల మొటిమలకు వ్యతిరేకంగా పోరాడటంలో సాయం చేస్తుంది. అలాగే బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది. కాలేయంలో విష పదార్థాలు, వ్యర్థపదార్థాల ఉత్పత్తుల ప్రభావం జీవక్రియ కొవ్వుపెరగడం మీద ఉంటుంది. శరీరంలో వ్యర్థపదార్థాలను తొలగించడానికి కాలేయంను నిమ్మకాయ నీరు సహాయం చేయుట వల్ల కొవ్వు తగ్గుతుంది. సరైన ఆహారం, శారీరక శ్రమ ఉంటేనే బరువు తగ్గడంలో నిమ్మకాయ నీరు మద్దతు ఇస్తుంది.
ఛాతీ ఇన్ ఫెక్షన్స్ కి చికిత్స, దగ్గు తగ్గించడానికి నిమ్మకాయ నీరు సహాయపడుతుంది. ఉబ్బసం అలెర్జీ సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మకాయ నీరు మంచి చికిత్స అని చెప్పవచ్చు. అంతేకాదు.. నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల చెడు శ్వాస, చిగురువాపు, పంటి నొప్పి చికిత్సలో సహాయపడుతుంది. అదేవిధంగా నిమ్మకాయ రసాన్ని అధికమొత్తంలో తీసుకుంటే పంటి ఎనామిల్ కి హాని కలిగిస్తుంది. అయితే ఉదయం సమయంలో నిమ్మకాయ నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక గ్లాస్ చల్లని లేదా వేడి నీటిని తీసుకోవాలి. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ నీటిలో అరచెక్క నిమ్మరసం పిండాలి. ఇందులో పంచదాల కలపకుండా త్రాగాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :