Home » ఐదే నిమిషాల్లో నీరసం పరార్… ఇలా చేస్తే చాలు..!

ఐదే నిమిషాల్లో నీరసం పరార్… ఇలా చేస్తే చాలు..!

by Sravya
Ad

ఒక్కొక్కసారి మనకి చాలా నీరసంగా ఉంటుంది. ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. ఇలా కనుక మీరు చేశారంటే త్వరగా నీరసం నుండి బయట పడొచ్చు. నీరసంగా ఉంటే పనిమీద ఏకగ్రత ఉండదు. ఆరోగ్యం కూడా పాడైనట్టు ఉంటుంది. అడుగు వేయడానికి కూడా మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే వెంటనే మీరు ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. మరి ఎలా మీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే కచ్చితంగా ఎనర్జీ వస్తుంది. పైగా వెంటనే మీరు మీ శక్తిని పొందొచ్చు. వీటి కోసం మీరు ఎక్కువ ధర కూడా ఖర్చు పెట్టక్కర్లేదు తక్కువ ధరలోనే పోషకాలని ఎక్కువ పొందొచ్చు. నీరసంగా ఉన్న వెంటనే ఒక అరటిపండును తీసుకొని తినండి క్షణాల్లో మీకు శక్తి వస్తుంది. తక్షణ శక్తిని అందించడానికి అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. శక్తి లేనప్పుడు పెరుగును తీసుకుంటే కూడా వెంటనే నీరసం తగ్గుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఎంతో బాగా ఉంటుంది.

Advertisement

ఒక గ్లాసు నీళ్లు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ని వేసుకుని తీసుకుంటే కూడా నీరసం పోతుంది. ఈ గింజలు మంచి ఎనర్జీని ఇస్తాయి. కావాలనుకుంటే మీరు చియా సీడ్స్ ని తాగినప్పుడు నిమ్మ రసాన్ని, తేనెని కూడా వేసుకుని తీసుకోవచ్చు. దెబ్బకి నీరసం మొత్తం పోతుంది. డార్క్ చాక్లెట్ ని తీసుకుంటే కూడా నీరసం తగ్గుతుంది. ఒక గ్లాసు కొబ్బరి పాలు తీసుకుని ఖర్జూరం, వేయించిన ఓట్స్ వేసుకుని తీసుకుంటే కూడా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు కావాలంటే గుమ్మడి గింజలు పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మీరు ఇన్స్టంట్ ఎనర్జీని పొందొచ్చు వెంటనే ఆరోగ్యంగా ఉంటారు.

Also read:

Asian Games : టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన ఈ నటి బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

Visitors Are Also Reading