Home » మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమాకి నష్టాలు వచ్చాయనే విషయం మీకు తెలుసా ?

మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమాకి నష్టాలు వచ్చాయనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అతడు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్  హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరమే లేదు. 2005లో వచ్చిన ఈ మూవీలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. కథ స్క్రీన్ ప్లే బలంగా ఉండడం.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ హీరో మాగంటి మురళీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంవరం మూవీతో సినిమా రచయితగా కెరీర్ ప్రారంభించేశారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు వంటి సూపర్ హిట్ సినిమాలకు కథ, మాటలను అందించారు. ఆ సమయంలోనే నువ్వే నువ్వే సినిమాతో మెగా ఫోన్ పట్టి దర్శకుడు అయ్యారు. రెండో సినిమాకే త్రివిక్రమ్ కి మహేష్ దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చేసింది.

Advertisement

అంతకుముందు కే.విజయభాస్కర్ డైరెక్టర్ గా చేసిన నువ్వునాకు నచ్చావు, మన్మధుడు వంటి సినిమాలకు మాటలను అందించారు త్రివిక్రమ్.  దీంతో మురళి మోహన్ ఓ సందర్భంలో త్రివిక్రమ్ ని పిలిచి మంచి కథ రెడీ చేసుకో ఓ సినిమా చేద్దామని త్రివిక్రమ్ తో చెప్పాడట. అయితే   అప్పటికే  స్రవంతి కిషోర్ కి మాట ఇచ్చాను.  ఫస్ట్ సినిమా అతనితో తీసిన తరువాత రెండో చేద్దామని చెప్పాడట. ఫస్ట్ సినిమా నువ్వే నువ్వే మూవీతో మంచి సక్సెస్ సాధించాడు. ఇక ఆ తరువాత మురళిమోహన్ గారి వద్దకు వచ్చి అతడు సినిమాకి సంబంధించిన కథ చెప్పాడట. దాదాపు మూడున్నర గంటల పాటు కథ చెప్పాడట త్రివిక్రమ్. 

Advertisement

 

అప్పటివరకు మహేష్ బాబుని ఎవ్వరూ చూపించని ఓ సరికొత్త కోణంలో చూపించారు త్రివిక్రమ్. ఈ సినిమా స్టోరీ హాలీవుడ్ రేంజ్ లో ఉందనే ప్రశంసలు కూడా వినిపించాయి. ఇప్పుడు బుల్లితెర మీద వచ్చిన కూడా టాప్ పీఆర్పీ రేటింగ్ సాధిస్తుందనే చెప్పాలి.  ఇంత  మంచి హిట్  సాధించినప్పటికీ  ఈ సినిమా నిర్మాత మురళీమోహన్ కు మాత్రం లాభాలను తీసుకురాలేదట.  ఇందుకు  కారణం  ఓవర్ బడ్జెట్ అంటున్నారు నిర్మాత మురళీమోహన్. సినిమా బాధ్యతలను త్రివిక్రమ్ కి అప్పగించడంతో బడ్జెట్ విషయంలో తొలుత అనుకున్న దాని ఎక్కువ ఖర్చు చేశారట. సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంపై అవగాహన లేకపోవడంతో బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే ఈ సినిమాకు ఎక్కువగా లాభాలు రాలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మురళిమోహన్ . 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ స్టార్ హీరోతో సినిమా ప్రారంభించిన వేణు మాధవ్ మధ్యలో వదిలేయడానికి కారణం ఏమిటి?

ఎంతో పాపులర్ అయిన మన కమెడియన్స్ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Visitors Are Also Reading