Home » ఎక్కువగా కాంట్రవర్సీ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఇవేనా ?

ఎక్కువగా కాంట్రవర్సీ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఇవేనా ?

by Anji
Published: Last Updated on
Ad

సినీ ఇండస్ట్రీలో కాంట్రి వర్సీలు అనేవి సర్వసాధారణం. పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే చాలు వివాదం అనేది ఆటోమేటిక్ గా రాజుకుంటుంది. సినిమా టైటిల్స్ నుంచి పాడిన పాటల వరకు ఇలా ప్రతి ఒక్క విషయంలో  కాంట్రవర్సీ చోటు చేసుకుంటాయి. పలు సినిమాల్లోని కొన్ని సన్నివేశాల వల్ల కూడా వివాదాలు వస్తుండడంతో వాటిని డిలీట్ చేసి  రిలీజ్ చేసిన సినిమాలున్నాయి. ఇలా ఏదో ఒక వివాదంలో  ఉన్న కొన్ని సినిమాల గురించి మనం తెలుసుకుందాం.

Advertisement

సైరా నరసింహారెడ్డి

Sye Raa Narasimha Reddy Movie Review {3/5}: A brave effort let down by uninspiring storytelling

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కూడా వివాదాలు తలెత్తాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చాలా విషయాలు తెలుసుకొని వారికి ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొణిదల ఆఫీసు దగ్గర చిరు ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు చివరికి ఈ వివాదం సద్దుమనగడంతో ఈ సినిమాను విడుదల చేశారు.

సర్కారు వారి పాట

మహేష్ నటించిన సర్కార్ వారి పాటా సెకండాఫ్ లో కీర్తి సురేష్ ను బ్లాక్ మెయిల్ చేసి తన పక్కన పడుకోమని అడుగుతాడు. అప్పుడు ఆమెపై కాలు కూడా వేస్తాడు. ఈ సన్నివేశంపై పలు వివాదాలు రావడంతో దర్శకుడు పరిసరం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అవి ఫలించలేదు.

రంగస్థలం

Manam News

రామ్ చరణ్ సమంత జంటగా నటించిన రంగస్థలంపై కూడా వివాదం మొదలైంది. ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ చూసినా అప్పట్లో ఈ పాట మార్మోగిపోయింది. ఈ పాటలో గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లుతుందంటే పాదాలు తమ జాతి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ యాదవ సంఘం డిమాండ్ చేసింది ఆ పదం తొలగించి సినిమా విడుదల చేశారు.

మర్డర్

రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం మర్డర్. జరిగిన పరువు హత్య గురించి తీసిన ఈ సినిమా వివాదాస్పదంగా మారింది. కోర్టులో కేసు ఉండగా వర్మ ఈ సినిమా తీశాడు. ఈ సినిమాలో చివరగా పిల్లలను కలగలం కానీ వారి మనస్తత్వాలను కడగలవా అంటూ ఎండ్ చేశాడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాపై ప్రణయ్ తండ్రి కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. రాంగోపాల్ వర్మ ఈ సినిమా వల్ల కోర్టులో నడుస్తున్న కేసు పై ప్రభావం పడే అవకాశం ఉందంటూ అమృత మావయ్య బాలస్వామి కోర్టులో కేసు వేశారు. ఈ మూవీ కూడా ఆర్జీ వరల్డ్ థియేటర్లో విడుదలైంది.

దరువు

Manam News

రవితేజ సినిమాకి టైటిల్ వివాదాస్పదమైంది. దరువు అనేది తమ సంస్కృతిలో భాగం అని తెలంగాణ సంస్కృతి సంఘం వ్యతిరేకించింది చివరికి వారిని నిర్మాత ఒప్పించి దరువు సినిమాను విడుదల చేశారు.

రచ్చ

Manam News

రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ సినిమాలోని వాన వాన వెల్లువాయే పాటలు గౌతమ్ బుద్ధ విగ్రహం ముందు చిత్రీకరించాలని మహిళా సంఘాలు రచ్చ రచ్చ చేశాయి. అందుకే ఈ పాటలు బుద్ధుడు కనపడకుండా రీ ఎడిట్ చేసి సినిమాను విడుదల చేశారు.

దువ్వాడ జగన్నాథమ్

Manam News

మాస్ డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథం. అప్పట్లో ఈ మూవీపై ఎన్నో వివాదాలు వచ్చాయి. ఈ సినిమాలో ఒక సీను లో అల్లు అర్జున్ గాయత్రి మంత్రం జపిస్తూ విలన్స్ తో పాటు చేస్తాడు. ఆ సమయంలో అల్లు అర్జున్ కాళ్లకు చెప్పులు ఉండటంపై వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

బెజవాడ

Manam News

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం బెజవాడ. ఈ సినిమాకి తల తో బెజవాడ రౌడీలు అనే పేరు పెట్టారు దీనిపై ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం తెలపడంతో టైటిల్లో రౌడీలు అనే పదాన్ని తొలగించి బెజవాడ అని ఫిక్స్ చేశారు.

కృష్ణం వందే జగద్గురుమ్

Advertisement

క్రియేటివ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో రానా హీరోగా నటించారు. ఈ సినిమా మొత్తం బళ్లారి మైనింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఓ ప్రముఖ పార్టీ లీడర్ ని ఈ సినిమాలోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించాలని పొలిటికల్ పార్టీ చాలా గొడవ చేశాయి అప్పట్లో.

కెమెరామేన్ గంగతో రాంబాబు

మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కెమెరామేన్ గంగతో రాంబాబు. ఈ సినిమాలో కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగులు ఉన్నాయంటూ కొందరు వివాదాన్ని సృష్టించారు కానీ ఈ సినిమా అలాగే విడుదల అయింది.

మగధీర

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో ఏం పిల్లడో వెళ్తా వస్తావా అనే విప్లవ గీతాన్ని వివాహ గీతానికి వాడాలని అది కూడా రచయిత వంగపండు ప్రసాద్ రావు అనుమతి లేకుండా పాట తీసుకున్నారని పెద్ద గొడవ జరిగింది చివరికి అతనికి నచ్చజెప్పడంతో వివాదం సర్దుకుని సినిమా రికార్డు స్థాయిలో విజయం సాధించింది.

అర్జున్ రెడ్డి

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ అర్జున్ రెడ్డి. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అభ్యంతర కరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయని కొందరు రాజకీయ నాయకులు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ సినిమా విడుదల సూపర్ హిట్ సాధించింది.

కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాంగోపాల్ వర్మ తీసిన మూవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమాపై టీవీలలో డిబేట్లు, గొడవలు పేరు మార్చడం వంటి గొడవలు జరిగాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్

Manam News

ఎన్టీఆర్ బయోపిక్ ధీటుగా రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీశాడు. ఈ సినిమా తీసి తన పంతాన్ని నెగ్గించుకున్నాడు వర్మ. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎలా వచ్చారు అనేది ఈ సినిమాలో చూపించాడు.

కింగ్

Manam News

 

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మూవీ కింగ్. ఈ సినిమాలో నాగార్జున బ్రహ్మానందం మధ్య వచ్చేసింది చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ కి ఆపాదిస్తూ అనేక ట్రోల్స్ వచ్చాయి.

దేనికైనా రెడీ

Manam News

మంచు విష్ణు మూవీ దేనికైనా రెడీలో బ్రాహ్మణులను ఏలన చేశారని కొంతమంది అప్పట్లో గొడవ చేశారు ఈ వివాదం చాలా వరకు కొనసాగింది . ఈ సినిమా హిట్టు అయినా ఈ గొడవ వల్ల చెడ్డ పేరే తెచ్చుకోండి.

1 నేనొక్కడినే

ఈ సినిమాలో హీరోయిన్ మహేష్ బాబు వెంటపడుతూ సాంగ్ పాడుతుంది. ఆ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ మహిళలను కించపరిచేలా ఉందంటూ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో స్పందించడంతో మహేష్ ఫ్యాన్స్ ఆమెపై రేంజ్ లో ఫైర్ అయ్యారు. తొలగించారు.

ఆగడు

AAGADU - Blockbuster Hindi Dubbed Full Action Movie | South Indian Movies Dubbed In Hindi Full Movie - YouTube

మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మూవీ ఆగడు. సినిమాలో విలన్ గా ఫస్ట్ ప్రకాష్ రాజు అని అనుకున్నారట. కొంత షూటింగ్ కూడా జరిగింది కానీ కొన్ని కారణాలవల్ల ప్రకాష్ రాజు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట ఇక ఆ తర్వాత ఇంటర్వ్యూలో ప్రకాష్ చెప్పిన మాటలను శ్రీను వైట్ల ఆగడు మూవీలో పెట్టడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక ఆ తర్వాత ఈ విషయం కాస్త సద్దుమణిగింది.

గద్దల కొండ గణేష్

Manam News

 

ఈ సినిమాకి మొదట హీరో పాత్రాన్ని బట్టి వాల్మీకి అని పేరును పెట్టారు. కానీ దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ మూవీ రిలీజ్ కి ఒకరోజు ముందు కోర్టు స్టే ఇచ్చింది దీంతో ఆ తక్కువ సమయంలోనే మూవీ పేరుని మార్చి విడుదల చేశారు సినిమా సూపర్ హిట్ అయింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

గుండు హనుమంతరావు కుమారుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోక ఉండరు..!

ఆ విషయంలో అతనే గ్రేట్.. బన్నీకి ఎవ్వరూ సాటిరారంటూ..?

ఈ 10 మంది హీరోలకు తండ్రి ఒక్కడే.. కానీ తల్లులు వేరు అనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading