Home » ఆ హీరోతో సినిమాని చెయ్యనని ”రాజమౌళి” చెప్పడానికి.. కారణం ఏమిటి అంటే..?

ఆ హీరోతో సినిమాని చెయ్యనని ”రాజమౌళి” చెప్పడానికి.. కారణం ఏమిటి అంటే..?

by Sravya
Ad

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా కలలు కంటూ ఉంటారు. రాజమౌళి ఇప్పటికే పెద్ద సినిమాలని కొంత మంది హీరోలతో చేసి.. వారికి పెద్ద హిట్ లని ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ఒక ఎత్తైతే రామ్ చరణ్ ఎన్టీఆర్ తో తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా మరొక ఎత్తు. ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆస్కార్ అవార్డుని కూడా కైవసం చేసుకుంది.

rajamouli 1

Advertisement

రాజమౌళి ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో సినిమాలు చేశారు కానీ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం సినిమాలు చేయలేదు. మహేష్ బాబు తో ప్రస్తుతం ఒక సినిమాని రాజమౌళి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యారట. దానికి కారణం అల్లు అరవింద్.

Advertisement

రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో మగధీర సినిమా చేశారు. అయితే సినిమా షూటింగ్ అప్పుడు అల్లు అరవింద్ రాజమౌళి మధ్య చిన్న విభేదం వచ్చింది. తనకి పేరు దక్కకుండా మొత్తం క్రెడిట్ అంతా కూడా అల్లు అరవింద్ తీసుకున్నారు. మా వల్ల ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చిందని అల్లు అరవింద్ అప్పట్లో చెప్పారు. దీంతో రాజమౌళికి కోపం వచ్చింది. అందుకని మగధీర విజయోత్సవానికి కూడా ఆయన వెళ్లలేదు అప్పటినుండి రాజమౌళి గీత ఆర్ట్స్ బానర్ పై ఒక సినిమాని కూడా చేయలేదు.

అదేవిధంగా అల్లు అర్జున్ తో కూడా ఒక్క సినిమాని కూడా చేయలేదు. అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకోలేదు. చాలామందికి ఈ విషయాన్ని రాజమౌళి చెప్పారు ఈ కారణంగానే అల్లు అర్జున్ తో సినిమాలకు సంబంధించిన విషయాలని రాజమౌళి ఎప్పుడు చెప్పడం కానీ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకోవడం కానీ జరగలేదు. మరి భవిష్యత్తులో అయినా అల్లు అర్జున్ రాజమౌళి సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి.

Also read:

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రామానాయుడు కోరిక ఇది.. మరి నెరవేరుతుందా..?

మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం చేసిన సినిమాలేవో మీకు తెలుసా..?

మైదా తో కలిగే నష్టాలు చూసారంటే.. అస్సలు ముట్టుకోరు..!

Visitors Are Also Reading