Home » రాజమౌళి-మహేష్ మూవీపై మైండ్ బ్లాస్టింగ్ అప్డేట్.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే..?

రాజమౌళి-మహేష్ మూవీపై మైండ్ బ్లాస్టింగ్ అప్డేట్.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే..?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌలి-సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటినుంచి అంచనాలు భారీగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా పనుల్లో బిజీ అవ్వనున్నాడు. ఒక సినిమా చేయడానికి దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు సమయం తీసుకుంటాడు రాజమౌళి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే మరి ఎంత సమయం తీసుకుంటాడు అనే భయం అందరిలోనూ నెలకొంది. దాని అవుట్ ఫుట్ కూడా ఓ పది సంవత్సరాలు చెప్పుకునేలా ఉంటుంది.  మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాపై చాలా నమ్మకం గానే ఉన్నారు.

మహేష్ బాబు లో ఉన్న యాక్టర్ ని ఎవరు సరిగ్గా ఉపయోగించుకోవడంలేదనే కంప్లైంట్స్ ఎప్పటినుంచో ఉండడంతో రాజమౌళి సినిమాతో మహేష్ యాక్టింగ్ పొటెన్సియాల్టీ బయటకు వస్తుందని పాజిటివ్ ఏర్పడింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి దర్శకుల వరుసలో చేరారు రాజమౌళి. మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడు అని ఆ విజువల్స్ గ్రాండ్ ఇయర్ ఎలా ఉండబోతుందో అని ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకొని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ని రైటర్ విజయేందర్ ప్రసాద్ మీడియాకు ఓ హింట్ ఇచ్చేశారు.
Mahesh Babu - Rajamouli

Mahesh Babu – Rajamouli

గతంలో విజయేంద్రప్రసాద్ మహేష్ తో రాజమౌళి చేయబోయే సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ అడ్వెంచరని చెప్పిన విషయం తెలిసింది. ఇప్పటికే ఎనిమిది నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు విజయేంద్రప్రసాద్. వచ్చే జూలై చివరి కల్లా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిచేసి రాజమౌళి సబ్ మిట్ చేస్తానని చెప్పాడు విజయేంద్రప్రసాద్. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతామని వివరించారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే మహేష్ మేకవర్ పై కూడా దృష్టి సాదించాడట. మహేష్ బాబు అతిధి సినిమా తరహా లాంగ్ హెయిర్ లో కనిపించబోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ  సినిమాకు ఎండ్ కూడా ఉండదని ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండవచ్చని విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో మహేష్ అభిమానుల్లో నూతన ఉత్సాహం వచ్చేసింది.  ఫ్రాంచైజీలో పలువురు హీరోలతో సినిమాలను రూపొందించాలని రాజమౌళి, విజయేంద్రప్రసాద్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Advertisement

Visitors Are Also Reading