పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌతు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా కృతి సనన్ నటించింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఆది పురుషు మూవీపై ప్రారంభం నుంచే వివాదాలు తలెత్తాయి. ఈ సినిమాలో రామానాన్ని తప్పుగా చూపించారని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. పురాణాల్లో ఉన్న రామాయణ ఇతిహాసాన్ని మార్చి తీశారని ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ కూడా పూర్ గా ఉండడంతో అభిమానులను నిరాశపరిచింది.
Advertisement
ఆది పురుష్ ప్రభాస్ క్రేజీ వల్ల కలెక్షన్లు అయితే రాబట్టింది కానీ.. ప్రస్తుతం ఆ కలెక్షన్లు కూడా పడిపోయినట్టు తెలుస్తుంది. ఉంటే ముఖ్యంగా రావణాసురుడు పాత్రను చూపించిన విధానంపై మండిపడుతున్నారు. సూర్యుడికి స్కైప్స్ పెట్టడం.. మాస్కులు పెట్టడం.. పాములతో మసాజ్ చేయించుకోవడం వంటివి చూపించారు దర్శకుడు ఓం రౌత్. అలాగే బంగారు నగరంగా పిలవబడే లంక నగరాన్ని ఏదో బొగ్గుల గనుల మధ్య మసి పట్టిన బంగ్లాగా నల్లగా చూపించారు. కనీసం సీతమ్మ ఉండే అశోక వనముని కూడా పచ్చగా చూపించలేకపోయారు. దీంతో ఆదిపురుష్ సినిమాపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు ప్రేక్షకులు.
Advertisement
ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ రావణాసురుడు గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు జై లవకుశ సినిమాలో రావణాసురుడు భక్తుడిగా నటించాడు ఎన్టీఆర్. ఆయనను పోలిన స్వభావం కలిగిన పాత్రను పోషించారు ఎన్టీఆర్. ఆ సినిమా సమయంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. రావణాసురుడు యొక్క గొప్పతనాన్ని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఇప్పుడు ఆ కామెంట్స్ ని షేర్ చేస్తూ పాత్ర పోషించిన ఎన్టీఆర్ రావణాసురుడు గురించి ఎంతగా తెలుసుకొని సినిమా చేస్తే.. ఇంత పెద్ద సినిమా చేసిన దర్శకుడు ఓంరౌత్ మాత్రం తెలుసుకోకుండా రావణాసురుడి పాత్రను డిజైన్ చేశారని ఫైర్ అవుతున్నారు. రామాయణం చదవకుండా కేవలం హాలీవుడ్ సినిమాలను చూసి సినిమాలను తీస్తే ఇలాగే ఉంటుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Samantha : మళ్లీ లవ్ లో పడ్డ హీరోయిన్ సమంత.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?