Home » విజయ్ దళపతి లియో థియేట్రికల్ బిజినెస్ గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

విజయ్ దళపతి లియో థియేట్రికల్ బిజినెస్ గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

తమిళ హీరో విజయ్ దళపతి గురించి దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. నిన్న, మొన్నటి వరకు ఒక తమిళ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో విజయ్ తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుతో వారసుడు సినిమా చేశాడు. దీంతో విజయ్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ వచ్చేసింది. 

Advertisement

వాస్తవానికి విజయ్ తెలుగులో సినిమాలు ఎప్పటి నుంచో డబ్ చేస్తున్నప్పటికీ మొదటి సారి సూపర్ హిట్ అందుకుంది మాత్రం.. మురగదాస్ తెరకెక్కించిన తుపాకి అనే చెప్పాలి. ఈ మూవీతోనే విజయ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. తుపాకీ మూవీతో తెలుగులో విజయ్ కి మంచి మార్కెట్ ఓపెన్ అయింది. ఇక అప్పటి నుంచి విజయ్ సినిమాలన్నీ దాదాపు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలై.. సూపర్ హిట్స్ గా నిలిచాయి. గత నాలుగైదు ఏళ్లలో విజయ్ హీరోగా నటించిన అదిరింది, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలు విజయ్ ని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. దీంతో విజయ్ కి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. 

Advertisement

 

ప్రస్తుతం విజయ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో లియో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఎవ్వరి ఊహకి అందకుండా ఏకంగా రూ.25కోట్లకు పలికింది. వచ్చే ఏడాది అక్టోబర్ లో విడుదలవ్వబోతున్న ఈ సినిమాకి పోటీగా బాలయ్య, రవితేజ సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ విజయ్ లియో మూవీకి ఇంత ధర పలకడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. ఇవాళ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రామ్ చరణ్ కంటే ఉపాసనే అధిక ధనవంతురాలా..? 

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?

Visitors Are Also Reading