టాలీవుడ్ సీనియర్ హీరో అయిన బాలకృష్ణ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం విధితమే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకు అనిల్‌రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య హీరోగా సంపత్‌నంది డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కనున్నదని వార్తలు వస్తున్నా.. ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. అఖండ సినిమా వరకు బాలయ్య ఒక్కో సినిమాకు రూ.10కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
Advertisement
అఖండ సక్సెస్‌తో బాలయ్య రెమ్యునరేషన్ పెంచారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కోసినిమాకు రూ.13కోట్లనుంచి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని టాక్. బాలయ్య సినిమాలకు బిజినెస్ కూడా బాగానే జరుగుతుండడంతో నిర్మాతలు సైతం బాలయ్య అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేయడం లేదు. బాలయ్య తరువాత నాలుగు సినిమాలతో ఏకంగా రూ.50కోట్ల రూపాయలకు పారితోషకం తీసుకుంటున్నారని టాక్.
Advertisement
బాలకృష్ణ వరుసగా సక్సెస్ సాధిస్తే మాత్రమే రెమ్యునరేషన్ మరింత పెరుగుతున్నదని అభిమానులు బావిస్తున్నారు. సింహా, లెజెండ్, సక్సెస్ తరువాత వరుస విజయాలను అందుకోవడంలో బాలయ్య పెయిల్ అయిన విషయం తెలిసిందే. అఖండ తరువాత మాత్రం బాలయ్య వరుస విజయాలను అందుకుంటారు అని అభిమానులు ఆశిస్తున్నారు. మాస్ సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకులకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరొకవైపు బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ మరిన్నీ సినిమాలు వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
బాలకృష్ణను అద్భుతంగా చూపించే దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అఖండ సినిమాకు సీక్వెల్ ఉండవచ్చు అని వార్తలు ప్రచారంలోకి రాగా.. ఆ వార్తలు నిజమవుతాయో లేదో చూడాలి మరీ. ఈ ఏడాదిలో కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేయాలని అనుకుంటున్నారు. వచ్చే నెల నుండి బాలయ్య గోపిచంద్ మలినేని మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.