Home » Shikhar Dhawan : ICC టోర్నమెంట్లలో శిఖర్‌ ధావనే మొనగాడు..కోహ్లీ, రోహిత్‌ పనికిరారు ?

Shikhar Dhawan : ICC టోర్నమెంట్లలో శిఖర్‌ ధావనే మొనగాడు..కోహ్లీ, రోహిత్‌ పనికిరారు ?

by Bunty
Ad

టీమిండియా జట్టు గత పది సంవత్సరాలకు icc టోర్నమెంట్ ను కొట్టలేదన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ధోని రిటర్మెంట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు కొనసాగారు. కానీ వీరిద్దరి సారథ్యంలో ఐసిసి టోర్నమెంట్లు టీమ్ ఇండియాకు అసలు రావడం లేదు. అయితే దీనికి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కారణమని చెబుతూ ఉంటారు. అయితే… ప్రతి ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్లో… ఓపెనర్ శిఖర్ ధావన్.. పాత్ర చాలా విలువైనదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా మంచి కనబరచాలంటే… శిఖర్ ధావన్ ను తీసుకోవాలని చెబుతూ ఉన్నారు.

Advertisement

దీనికి కారణం శిఖర్ ధావన్ ఐసీసీ టోర్నమెంటులో ఆడిన ఆట తీరే. ఒకసారి ఈ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల ఐసీసీ టోర్నమెంట్ ల గణాంకాలను పరిశీలిద్దాం. ఇప్పటి వరకు 20 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచులు ఆడిన శిఖర్ ధావన్… 1238 పరుగులు చేశాడు. 65.1 యావరేజ్తో… 96.7 స్ట్రైక్ రేట్ ను మెయిన్ టైన్ చేయగలిగాడు. అలాగే ఇందులో ఆరు సెంచరీలు చేసిన దావత్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఆ రోహిత్ శర్మ విషయానికి వస్తే… ఐసీసీ టోర్నమెంట్ లో 27 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ… 1459 పరుగులు చేశాడు. ఇందులో స్ట్రైక్ రేట్ 91 ఉండగా… 60 యావరేజ్ ఉంది. అలాగే ఏడు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

Advertisement

ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే… 38 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ… 1559 పరుగులు చేసి 55 యావరేజ్ మైంటైన్ చేశాడు. 88 స్ట్రైక్ రేట్ తో రెండు సెంచరీలు… 11 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఈ ముగ్గురిలో… తక్కువ మ్యాచ్లు వాడిన శిఖర్ ధావన్… చాలా కన్సిస్టెంట్ గా ఆడి.. టీమిండియా కు విజయాలు అందించాడు. ఇటు ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో కూడా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కంటే మంచి మాట తీరును కనబరిచాడు శిఖర్ ధావన్. ఆరు నాకౌట్ మ్యాచ్లు ఆడిన శిఖర్ ధావన్ ఏకంగా 240 పరుగులు చేశారు. ఇందులో యావరేజ్ 40 ఉండగా స్ట్రైక్ రేట్ 91.6 గా ఉంది. అలాగే ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అంటే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కంటే… శిఖర్ ధావన్ చాలా… బాగా ఆడుతున్నాడు అన్నమాట. ఈ లెక్కన 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా శిఖర్ ధావన్ ను ఆడిస్తే… టీమిండియా కప్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గత 10 ఏళ్లుగా టీమిండియా.. ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీలను ఎందుకు గెలవడం లేదు ?

ODI World Cup 2023 : ఆ రెండు ఇండియా పిచ్‌ లంటే వణికిపోతున్న పాక్‌..? కారణం ఇదేనా..?

టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ?

Visitors Are Also Reading