పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ జూన్ 16న దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు రూ.140 కోట్లు వసూలు చేసి రికార్డునే క్రియేట్ చేసింది. అయినప్పటికీ ఈ సినిమాపై మాత్రం ఇంకా నెగటివ్ టాక్ వినిపిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు, ఫ్యామిలీస్, చిన్న పిల్లలు ఆదిపురుష్ మూవీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisement
వాస్తవానికి పౌరాణిక సినిమాలు అంటే ఇష్టపడే వారు ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు రామాయణం అంటే సినిమా ఎలా ఉండాలి ? ఎలా తీశారు ? రామాయణం చదవకుండానే ఈ సినిమా తీసినట్టుంది. ఏ పాత్రను అంత స్పష్టంగా చూపించలేదు. ముఖ్యంగా కుంభకర్ణుడి పాత్రను ఏదో తీశామా అన్నట్టుగా తీశారు అని మండిపడుతున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ కొన్ని బాగున్నప్పటికీ మరికొన్ని మాత్రం మెప్పించలేకపోయాయనే చెప్పాలి.
Advertisement
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాత్రల పేర్లు మార్చారని కొంత మంది మండిపడుతున్నారు. రాఘవుడు, జానకి, శేషు అంటే ప్రేక్షకులకు అంతగా నచ్చలేదనే చెప్పాలి. దీనిపై తాజాగా హిందూ జనశక్తి కూడా సీరియస్ అయింది. భవిష్యత్ లో పౌరాణిక సినిమాలు ఇంకా ఎవరైనా తీస్తే భయంతో హిందువులు గుండెలు పట్టుకునే స్థాయికి ఆదిపురుష్ తెచ్చిందని ఆరోపించింది. ఈ సినిమాలో రాముడు, సీత అని పేర్లు పెట్టడానికి ఓం రౌత్ కి ఇబ్బంది ఏంటి అని ఫైర్ అయింది హిందూ జనశక్తి. రఘు కులంలో పుట్టాడు కాబట్టి రాఘవుడు అయ్యాడు అని.. కానీ ఆయన పేరు రాఘవుడు కాదు.. ఆయన పేరు రాముడు. అలాగే జనకమహారాజు కూతురు కాబట్టి జానకి అని అసలు పేరు సీత అన్నారు. ఇదిలా ఉంటే సినిమాపై ట్రోల్స్ రావడంతో రైటర్లు ప్లేట్ ఫిరాయించారు. కొందరూ ఇది రామాయణం కాదని పేర్కొంటున్నారు. రామాయణం నేపథ్యం మాత్రమే ఉందని.. కానీ రామాయణం కాదనడం గమనార్హం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మొదట ప్లాప్ టాక్ ని అందుకొని ఆ తర్వాత సెన్సేషనల్ హిట్ అయిన మహేష్ బాబు చిత్రాలు ఏవో తెలుసా..?
SV కృష్ణా రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు మిస్ అయిందంటే ?
JD Chakravarthy : కట్టుకున్న భార్యనే నాకు విషం పెట్టి చంపాలని చూసింది..!