ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా, కృతి సనన్ కథానాయకగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ జూన్ 16 న విడుదలైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, దేవదత్తా నాగే హనుమంతుడిగా నటించారు. సుమారు రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఆదిపురుష్ సినిమానకు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ సినిమా సూపర్ అంటుంటే.. మరికొందరు సినిమా మేకింగ్ బాగోలేదని కుండ బద్దలు కొడుతున్నారు.
Advertisement
ఏది ఏమైనప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజే మంచి రెస్పాన్స్ తో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. రామాయణం కథ ఆధారంగా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఈ చిత్ర సంగీతం మూవీకి పాజిటివ్ టాక్ తీసుకొచ్చాయి. ప్రభాస్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన ఆదిపురుష్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా ఎప్పటినుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అందరూ తెగ సెర్చ్ చేయడం మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఆదిపురుష్ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినీ ప్రేమికులు వీక్షించవచ్చు. కానీ ఇప్పుడు గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఓటీటీలో కన్న ఈ సినిమాను థియేటర్ లో చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుందని బృందం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. దాని ప్రకారమే అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం వెళ్లడవుతుంది. ఈ చిత్రం కోసం ఓటీటీ మూవీ లవర్స్ ఎనిమిది వారాలకు వేచి ఉండాల్సిందే అని సమాచారం వినిపిస్తుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ సన్నివేశాన్ని గమనించారా..?
కొడాలి నాని వలన ఎన్టీఆర్, వి. వి వినాయక్ కాంబినేషన్లో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా..?
ఆదిపురుష్ పై నెగటివ్ టాక్ రావడానికి గల 5 కారణాలు ఇవేనా ?