Home » విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

by Bunty
Ad

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత విన్నర్, సుప్రీమ్ వంటి సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్న తర్వాత విరూపాక్ష సినిమాలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.

Advertisement

ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ త్రిల్లింగ్ ఫ్యాక్టర్స్, ఫైనల్ ట్విస్ట్ లు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో డైరెక్టర్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో సంయుక్త నటనకు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా అద్భుతంగా నటించి సూపర్ హిట్ అందుకుంది సంయుక్త మీనన్. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం సంయుక్త మీనన్ ను కాకుండా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారట. అయితే అనుపమా వేరే సినిమాలో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి నో చెప్పిందట.

Advertisement

Anupama

అనుపమాకి నెగటివ్ షేడ్స్ లో నటించడం అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు అనుపమ పరమేశ్వరన్ చాలా బాధపడిందట. ‘అ.. ఆ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి ఈ బ్యూటీ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ పోతుంది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది. ఈ అమ్మడు నటనకు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇవి కూడా చదవండి :

Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

IT బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు… చంద్రబాబుపై అంబటి రాయుడు ఫైర్

Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?

Visitors Are Also Reading