Home » అతని వల్లనే టీమిండియా WTC ఫైనల్ కి చేరుకుందా ? అందుకేనా కప్ మిస్..! 

అతని వల్లనే టీమిండియా WTC ఫైనల్ కి చేరుకుందా ? అందుకేనా కప్ మిస్..! 

by Anji
Ad

భారత జట్టు WTC ఫైనల్ లో ఘోరంగా ఓడిపోవడంపై అటు అభిమానులు.. ఇటు మాజీలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలే  ఈ మ్యాచ్ ముగిసినప్పటికీ.. ఆ అసహనం మాత్రం తీరడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మరో మాజీ ప్లేయర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రెకర్ ఈ విషయం పై మాట్లాడాడు. భారత జట్టుకు సంబంధించిన బ్యాటింగ్ చాలా ఏళ్లు సమస్యాత్మకంగానే ఉందని పేర్కొన్నాడు. 

Advertisement

 

విదేశాల్లో భారత జట్టు ఆడిన మ్యాచ్ లలో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం అవుతూనే ఉందని మండిపడ్డారు. 2022 నుంచి టీమిండియా టాప్ ఫోర్ ఆటగాళ్లు పరుగులు చేయడం చాలా తక్కువనే అని.. కేవలం 33.4 సగటుతో వారు పరుగులు చేశారని చెప్పాడు. ఇది పాకిస్తాన్ కంటే కూడా తక్కువే అని గుర్తు చేశాడు. టాప్ 4 బ్యాటర్ల సగటులో భారత్ అత్యంత తక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక టాప్ ఆర్డర్ సగటును ఒకసారి పరిశీలించినట్టయితే.. ఇంగ్లండ్ (39.09) శ్రీలంక 44.06, న్యూజిలాండ్ 45.01, పాకిస్తాన్ 46.07, ఆస్ట్రేలియా 48.08 సగటుతో ఉన్నాయి. భారత్ కంటే ముందున్నాయి.

Advertisement

కేవలం ఒకరిద్దరూ ఏదో ఆడినట్టు గుర్తు. మిగతా వారందరూ ఫామ్ లో లేక నానా తంటాలు పడిన వారే. అందుకే మనం ఫైనల్ లో ఓడిపోయినట్టు చెప్పుకొచ్చాడు. టాప్ 5 బ్యాటర్లలో కనీసం ముగ్గురైన ఫామ్ లో ఉండాలని.. టీమ్ సక్సెస్ సాధిస్తుందని మంజ్రెకర్ చెప్పాడు. విదేశాల్లో ఆడినటువంటి టెస్ట్ మ్యాచ్ లలో టీమిండియాలో కేవలం రిషబ్ పంత్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడని.. మిగతా వారు అంతగా ఆడలేదు. అతని వల్లనే విదేశాల్లో భారత్ చాలా మ్యాచ్ లు గెలిచిందని తెలిపాడు. బంగ్లాదేశ్ టెస్టులు మినహా మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ విదేశీ టెస్ట్ సిరీస్ లో భారత్ టాప్ 6 ఆటగాళ్ల ఫామ్ సరిగ్గా లేదని పేర్కొన్నాడు. ముఖ్యంగా భారత్ WTC పైనల్ కి చేరుకోవడంలో రిషబ్ పంత్ పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి. 

మరికొన్ని ముఖ్య వార్తలు :
ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

అతని కొడుకు కోసం నా కెరీర్ నాశనం చేశాడు’.. అంబటి రాయుడు సెన్షేషన్ కామెంట్స్..!

ఈ రాశులకి చెందిన మహిళలకు ఎలాంటి పురుషులు నచ్చుతారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Visitors Are Also Reading