ఒకప్పుడు ప్రయాణం అంటే ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ఉండేది. ఇప్పటికీ ఆర్టీసీ హవా కొనసాగుతున్నా, ఓలా మరియు ఊబర్ వచ్చాకా ఆటోల్లో ప్రయాణం కూడా ఎక్కువ అయ్యింది. ఎక్కడినుంచి అయినా ఫోన్ లో చిటికెలో ఆటో లేదా క్యాబ్ లను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చాక వీటి వాడకం ఎక్కువగా జరుగుతోందనే చెప్పాలి. అయితే.. వీటితో ఉండే ప్రధాన సమస్య క్యాన్సిలేషన్.
Advertisement
ఆటో రైడ్ బుకింగ్ కంఫర్మ్ అయ్యిన తరువాత రైడ్ ఆక్సిప్టు చేసిన డ్రైవర్లు రైడ్ కాన్సల్ చేయడమో లేక ఫోన్ చేసి మీరే కాన్సల్ చేయాల్సిందిగా వినియోగదారులను కోరడమో చేస్తుంటారు. అయితే.. ఈ సమస్య ఎదురయ్యినప్పుడు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి బుక్ అయిపోయిన రైడ్ ను కాన్సల్ చేయడం అనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కన్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) పేర్కొంది. ఇప్పటికే ఈ విషయమై చాలా ఫిర్యాదులు రావడంతో ఓలా, ఊబర్ కంపెనీలకు ఫిర్యాదులు ఇచ్చామని పేర్కొంది.
Advertisement
బుకింగ్ కాన్సల్ చేసేలా డ్రైవర్లు కష్టమర్లపై ఒత్తిడి తేవడం, క్యాష్ మాత్రమే పే చేయాలనీ అడగడం, కస్టమర్ కేర్ విభాగాలు సరిగా స్పందించకపోవడం, ఇంకా కొందరు డ్రైవర్లు అదనపు చార్జీలను అడగడం లాంటి సమస్యలపై ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు డ్రైవర్లు రాకుండా ఆలస్యం చేసి, రైడ్ కాన్సల్ చెయ్యాలని వినియోగదారులపైనే ఒత్తిడి చేయడం కూడా జరుగుతోంది. దీనివల్ల పడే పెనాల్టీ చార్జీలను వినియోగదారులు భరించాల్సి వస్తుంది.
దీనితో ఈ కాన్సలేషన్ సమస్య లేకుండా ఉండడం కోసం ఓలా “ప్రైమ్ ప్లస్” ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ కండిషన్ లో ఉంది. ఈ ఫీచర్ లో బెస్ట్ డ్రైవర్లతో పాటు కాన్సలేషన్ లేకుండా ఉండేలా సర్వీస్ తీసుకురానున్నట్లు ఓలా సీఈఓ పేర్కొన్నారు. మరో వైపు ఊబర్ కూడా రైడ్ కి ముందే కస్టమర్లు ఏ రూపంలో డబ్బు చెల్లిస్తారో తెలిసేలా ఫీచర్ తీసుకొస్తోంది. దీనివలన డ్రైవర్లు ముందుగానే చూసుకుని రైడ్ యాక్సెప్ట్ చేస్తారు. దీనితో క్యాన్సిలేషన్లు తగ్గుతాయని ఊబర్ భావిస్తోంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
‘అతని కొడుకు కోసం నా కెరీర్ నాశనం చేశాడు’.. అంబటి రాయుడు సెన్షేషన్ కామెంట్స్..!
ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!
సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. ఇదే నిజమవుతుందా ?