సాధారణంగా కొంత మంది శుభం, అశుభం నమ్ముతుంటారు. ఎప్పుడు శుభం కలుగుతుంది.. ఎప్పుడు అశుభం కలుగుతుందనే విషయాలను పెద్దలు పక్కాగా పట్టించుకుంటారు. కొన్నింటిని పాటించినట్టయితే తప్పకుండా విజయం జరుగుతుందని నమ్ముతారు. వాటిలో ఈ ఐదు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మామూలుగా ఇంట్లో నుంచి బయటికీ వెళ్లే సమయంలో మీకు ఎక్కడైనా శంఖం శబ్ధం వినిపించినట్టయితే అంతకంటే మంచి శకునం ఇంకొకటి ఉండదట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. భగవంతుడి అనుగ్రహం మీకు ఉంటుంది. మీకు అన్ని పనుల్లో తప్పక విజయం కలుగుతుంది.
అదేవిధంగా మీరు మీ ఇంటి నుంచి ఏదైనా పని మీద బయటికీ వచ్చి గుడి గంట శబ్దం వినిపించినట్టయితే మీ విజయానికి చిహ్నం. దీంతో మీ దైవానుగ్రహంతో పాటు సిరిసంపదలు లభిస్తాయట.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా పని మీద బయటికీ వెళ్తుంటే.. దారిలో మీకు అంత్యక్రియల ఊరేగింపు కనిపించినట్టయితే మీరు దానికి చేతులు జోడించి నమస్కరించండి. అంత్యక్రియలు ఊరేగింపు కనిపించడం మానవులకు శుభసూచకమే. కానీ కొందరూ అశుభం అనుకుంటారు.
Advertisement
సాధారణంగా ఉదయం వేళలో బిచ్చగాడు మీ ఇంటివద్దకు వస్తే.. శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. బిచ్చగాడికి ఏదైనా విరాళంగా ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం పురోగమిస్తుంది. ఇతరుల వద్ద ఉండిపోయిన మీ డబ్బు కూడా మీ చేతికి అందుతుంది.
ఒకవేళ మీరు విదేశీ పర్యటనకు వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా పని కోసం వెళ్తున్నప్పుడు ఆవు లేదా ఆవు దూడకు ఆహారం ఇవ్వడం మీకు కనిపించినట్టయితే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దారిలో ఆవు పేడ కనిపించడం కూడా శుభసూచకమే.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :