పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటించింది. రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Advertisement
దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై ముందు నుండి వివాదాలు కూడా వస్తున్నాయి. సినిమాలో రామాయణాన్ని వక్రీకరించి చూపిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇక ట్రైలర్ లో కృతి సనన్ సీత పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా లంకలో ఉన్న సీతమ్మ తన ఆనవాలుగా ఆంజనేయుడికి చేతి గాజులు ఇచ్చినట్టుగా చూపించారు.
Advertisement
అయితే నిజానికి రామాయణంలో సీతమ్మ తన చూడామణిని గుర్తుగా హనుమంతుడికి ఇస్తుంది. కానీ సినిమా ట్రైలర్ లో మాత్రం ఆ స్థానంలో గాజు ఇచ్చినట్టు చూపించారు. దాంతో డైరెక్టర్ ఓం కు మినిమమ్ నాలెడ్జ్ కూడా లేదని… ఆయన రామాయణం పై ఎందుకు సినిమా చేశారని నెటిజన్ లు మండిపడుతున్నారు.
చూడామని స్థానంలో గాజు పెట్టడం ఏంటి డైరెక్టర్ గారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కాగా మొదట సినిమా టీజర్ పై కూడా ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. సినిమాలోని ఎడిటింగ్ ఫన్నీగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. కానీ ట్రైలర్ మాత్రం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇలాంటి సమయంలో మళ్ళీ ట్రోల్స్ రావడం చిత్ర యూనిట్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ముఖ్య వార్తలు !
- ఎన్టీఆర్ కు వారసత్వంగా తాత నుండి ఎన్ని కోట్ల ఆస్తి వచ్చిందో తెలుసా..? అదొక్కటి చాలు టైమ్ సెటిల్ మెంట్..!
- పవన్ అన్నా లెజొనోవా మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసా..? సినిమా రేంజ్ లవ్ స్టొరీ ఇదే..!
- ఫ్లాప్ టాక్ వచ్చిన నిజం ఎన్ని కోట్లు వసూలు చేయిందో తెలుసా..?