దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిలో తేజ ఒకరు. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో తేజ ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా మారారు తేజ. అందమైన ప్రేమ కథలను చాలా సహజంగా.. మన పక్కింట్లోనో లేక మన ఊర్లో జరిగినటువంటి సంఘటనలను ఆధారంగా అద్భుతంగా తెరకెక్కిస్తారు తేజ. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో జయం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు తేజ. ప్రస్తుతం అహింస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజ.
Advertisement
ఈ సినిమాతో దగ్గుపాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు తేజ. తేజ కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి, పడిన కష్టాల గురించి తెలిపారు. అలాగే అహింస సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తేజ తెరకెక్కించిన సినిమాల్లో జయం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Advertisement
ఈ సినిమాల్లో తేజ టీచర్ పాత్రకు *గార తారగా పేరు తెచ్చుకున్న షకీలాను ఎలా ఎంపిక చేశారో వెల్లడించారు. హైదరాబాద్ లోని ఓ థియేటర్ వైపుగా ఆర్పీ పట్నాయక్ తో కలిసి వెళుతుండగా.. ఓ థియేటర్స్ లో జనాలు గుంపులు గుంపులుగా వెళ్లడం చూశారట. జనాలు ఎందుకు అంతగా ఎగబడుతున్నారని చూస్తే అది కామేశ్వరి అనే షకీలా సినిమా అంట. షకీలా అలా తెరపై కనబడగానే కుర్రకారు హారతులు పట్టారట. ఆ తర్వాత తన జయం సినిమాలో కాలేజ్ లెక్చరర్ పాత్రకు షకీలాను ఫిక్స్ అయిపోయినట్టు చెప్పుకొచ్చాడు దర్శకుడు తేజ. తేజ దర్శకత్వంలో తెరకెక్కే అహింస సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చిరంజీవి-అక్కినేని కాంబోలో వచ్చిన మెకానిక్ అల్లుడు ఎంత వసూలు చేసిందో తెలుసా ?
టీడీపీ మెనిఫెస్టో.. చంద్రబాబు 6 ప్రధాన హామీలు ఇవే..!
ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..?