Home » చిరంజీవి-అక్కినేని కాంబోలో వచ్చిన మెకానిక్ అల్లుడు ఎంత వసూలు చేసిందో తెలుసా ?

చిరంజీవి-అక్కినేని కాంబోలో వచ్చిన మెకానిక్ అల్లుడు ఎంత వసూలు చేసిందో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయనుకోవడం పొరపాటే. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ తీసిన సినిమా ఫ్లాప్స్ గా నిలిచినవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో మెకానిక్ అల్లుడు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు కాంబోలో వచ్చింది ఈ సినిమా. 

Advertisement

చిరంజీవి అప్పటికే ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలతో నెంబర్ 1 హీరోగా మారిపోయాడు. అలా వర్తమానంలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న చిరంజీవి.. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి సినిమా చేస్తుండటంతో విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. విడుదలైన తరువాత అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం చెందింది. ఈ సినిమా బోర్ అనిపించడం వల్ల బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.అలా అభిమానులకు ఒక తీపి జ్ఞాపకం లాగ మిగిలిపోవాల్సిన ఈ చిత్రం, చేదు జ్ఞాపకం గా మిగిలింది.

Manam News

Advertisement

ఈ కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ చిత్రానికి అప్పట్లో మంచి ఓపెనింగ్స్ దక్కాయి.  అప్పటి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం. ఈ సినిమా నాలుగు కోట్ల షేర్ వసూలు చేసిందట. నీ అప్పట్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ చిత్రానికి దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు జరిగిందట. చిరంజీవి ఫామ్ లో ఉండటం, నాగేశ్వరరావు లాంటి అగ్రహీరో అందులో నటించడం, హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న విజయశాంతి హీరోయిన్ కావడం.. వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న బి.గోపాల్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాని బయ్యర్లు కొనేశారు. బంపర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల నష్టం ఫుల్ రన్ లో వచ్చింది. కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయం లో డైరెక్టర్ కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయ్యేది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పూజా హెగ్డే ఆస్తులు ఎంతో తెలుసా.. స్టార్ హీరోల కంటే ఎక్కువ

మెగాస్టార్ దర్శకత్వం వహించిన సినిమా ఏంటో తెలుసా..?

నటి ఊహ మేనమామ కూడా స్టార్ నటుడని మీకు తెలుసా..?

Visitors Are Also Reading