Home » ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..?

ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు గ్రామాల్లో ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి. ఆ ఫోన్లతో ఊర్లో సమాచారాన్ని ఇతర మిత్రులకు అందించేవారు. టెక్నాలజీ డెవలప్ అయిన సందర్భంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. గుడిసెలో ఉన్న వారికి కూడా ఇది తప్పనిసరి అయింది.జనాలు కూడా స్మార్ట్ ఫోన్ కు విపరీతంగా అడిక్ట్ అయ్యారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఫోన్ లేకుండా నిమిషం ఉండలేకపోతున్నారు. అలాంటి స్మార్ట్ ఫోన్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

Advertisement

ప్రస్తుత కాలంలో చాలామంది ఉన్న సగం సమయాన్ని స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నారు. ఉదయం లేవగానే ముందుగా స్మార్ట్ ఫోనే పట్టుకుంటారు. ఫోన్ చూసాకనే మంచం దిగుతారు. అంతగా ఆడిక్ట్ అయ్యారు జనాలు. అయితే ఉదయం లేవగానే ఫోన్ చూడడం ప్రమాదమని,అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మార్నింగ్ లేవగానే చూస్తే కళ్ళపై ఎఫెక్ట్ ఎక్కువ గా పడుతుందట. అయితే రాత్రంతా విశ్రాంతి తీసుకుని ఉన్న కళ్ళు లేవడంతోనే స్మార్ట్ఫోన్ వెలుగు పడడంతో ఇబ్బందికి గురవుతాయట.

Advertisement

అది వయసు మీద పడ్డా కొద్ది ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఫోన్లో మంచి చెడు వార్తలు ఉండవచ్చు. చెడు వార్తలు చూసినప్పుడు మన మెదడుపై ప్రభావం పడుతుందట. దీనివల్ల రక్తపోటు పెరగడం తగ్గిపోవడం జరుగుతుంది. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒత్తిడి, తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading