Home » మెగాస్టార్ దర్శకత్వం వహించిన సినిమా ఏంటో తెలుసా..?

మెగాస్టార్ దర్శకత్వం వహించిన సినిమా ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీలో దిగిన ఏకైక హీరో. చిరంజీవి ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే పెద్దన్నలా ఉన్నారు. అయినా కానీ చాలా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి ఆయన తన ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఎన్నో సినిమాల్లో ఆయన హీరోగా చేశారు తప్ప మిగతా ఫీల్డ్ లోకి వెళ్లలేదని చాలామందికి తెలుసు.

Advertisement

కానీ మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించారట. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. చిరంజీవి దర్శకుడు మాత్రమే కాక కెప్టెన్ గా వ్యవహరిస్తారు. అతడు సినిమా ఎలా చేయాలి అని ఒక ఆలోచనతో ప్రతి సన్నివేశాన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారనే విషయం చాలా మందికి తెలియదు. 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా అందరికీ తెలుసు.

Advertisement

దీనికి బాపినీడు డైరెక్షన్ చేశారు. అయితే ఈ చిత్రంలో కీలక సన్నివేశానికి సంబంధించి చిరంజీవి డైరెక్టర్ చెప్పినవి కాకుండా తన ఆలోచన ప్రకారం చేశారట. అలా చిరంజీవి చెప్పినట్టు చేయడంతో ఆ సన్నివేశాలు ఆ సినిమాకి హైలైట్ గా నిలిచాయని అప్పట్లో టాక్ వినిపించింది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచనాలను సృష్టించిందో మనందరికీ తెలుసు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

 

Visitors Are Also Reading