ఉత్తమ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి ఒక పాటలో నటించాడు శేఖర్ మాస్టర్. అంతేకాదు ఆ పాటలో రెండు కాళ్లు లేని కుంటివాడిగా నటిస్తూ హృతిక్ రోషన్ కి క్రిష్ పాత్రకు మద్దతు పలుకుతూ పాట పాడే సన్నివేశం ఉంటుంది. ఈ పాటలో హృతిక్ రోషన్ పక్కనే శేఖర్ మాస్టర్ ఉన్న సంగతి మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ పాట యూ ట్యూబ్ లో కూడా ఉంది. క్రిష్ 3 సినిమాల్లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
Advertisement
సాధారణంగా తెలుగు సినిమాలలో చాలా సార్లు పాట మధ్యలో వచ్చి పోయే పాత్రలో శేఖర్ మాస్టర్ చాలాసార్లు కనిపించాడు. కానీ ఒక బాలీవుడ్ చిత్రం కోసం మొదటి సారి అతిథి పాత్ర చేశారు. ఇక ఈ సినిమాల్లో హృతిక్ రోషన్ , ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 2015 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ సినిమాకు మొట్టమొదటి సారిగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆయన ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన రాకేష్ మాస్టర్ దగ్గర చాలా కాలం పని చేశారు.
Advertisement
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఒంటరి గానే సినీ ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చాడు. దాదాపు 6 సంవత్సరాలకు పైగా గ్రూప్ డాన్సర్ గా, బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఒక 8 సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా కూడా పనిచేయాల్సి వచ్చింది. విజయవాడ నుంచి వచ్చిన శేఖర్ మాస్టర్ దాదాపు ఇప్పటి వరకు చాలా సినిమాలకి పనిచేశాడు. చాలా సినిమాలకు ఉత్తమ కొరియా గ్రాఫర్ అవార్డును కూడా అందుకున్నాడు శేఖర్ మాస్టర్.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?
బోయపాటి-రామ్ సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుందా ?