Home » బోయపాటి-రామ్ సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుందా ?

బోయపాటి-రామ్ సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుందా ?

by Anji
Ad

ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ తో పవర్ పుల్ గా కనిపించిన రామ్.. బోయపాటి మార్క్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. చాలా వరకు షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా దసరా రేస్ నుంచి తప్పుకొని దసరా కంటే ముందే విడుదల కానున్నట్టు  తెలుస్తోంది. అక్టోబర్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాంపిటీషన్ లో పడి నష్టం మూట కట్టుకునే కంటే పోటీలేని సమయంలో రిలీజ్ చేసి సేఫ్ జోన్ లో ఉండాలని నిర్మాతలు భావిస్తున్నారట.

Advertisement

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేని రామ్ కి లేదు. దీంతో  ఈ సినిమా చాలా కీలకంగా మారింది. రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ మారనుందని వార్తలు వస్తున్నా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట  మూవీ మేకర్స్. 

Advertisement

రిలీజ్ డేట్ లో మార్పు ఉంటుందన్న విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని సమాచారం. తెలుగు సహా ఐదు భాషల్లో రూపొందిన ఈ సినిమా రామ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా అవుతుంది. ప్రస్తుతం చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా హిట్స్ అందుకుంటున్న నేపథ్యంలో హీరో రామ్ కూడా ఆ జాబితాలో చేరతాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. మరి, తనపైనే ఆశలు పెట్టుకున్న రామ్ కి బోయపాటి హిట్ ఇస్తాడా లేదా వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ ఒక్క తప్పు చేయకుంటే.. ఇప్పటికీ ఉదయ్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోవ్ !

సంతానం లేదు… మరీ శరత్‌ బాబు కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు..!

Ramabanam OTT : రామబాణం ఓటిటి డేట్ ఫిక్స్…. ఎప్పటినుంచి అంటే

Visitors Are Also Reading