తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేగా ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఆయన నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని మెగా రాంచరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగారు. చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. అప్పట్లో ఈ సినిమా రికార్డుల మోత మోగించింది.
Advertisement
100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు మూవీగా అప్పట్లో రికార్డులు తిరగ రాసింది. 2009 జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. కామెడీ, గ్రాఫిక్స్,ఫైట్స్ అన్ని ఓ చరిత్ర సృష్టించాయి. రెండు జన్మల ప్రేమ కథ బేస్ తో తెరికెక్కిన మగధీర చిత్రంలో శ్రీహరి కీలకమైన పాత్ర పోషించారు. ఇందులో కీరవాణి సంగీతం సినిమాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సరిగ్గా వారం రోజులకు నాచురల్ స్టార్ నాని నటించిన స్నేహితుడా మూవీ రిలీజ్ అయింది.
Advertisement
హీరోయిన్ మంచి నటనతో అదరగొట్టింది కానీ సినిమా మగధీర ముందు తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నీతిన్ హీరోగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన అడవి మూవీ కూడా ఆగస్టు 7న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఆగస్టు 12న వచ్చిన మాస్ రవితేజ నటించిన ఆంజనేయులు మూవీ యావరేజ్ గా నిలిచింది. ఇక నయనతార హీరోయిన్ గా చేసిన ఈ మూవీకి పరశురాం దర్శకుడిగా వ్యవహరించారు. ఈ విధంగా మగధీర సినిమా వచ్చిన టైంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అయి ఆ చిత్రము ముందు నిలవలేకపోయాయి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?
- AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు
- BREAKING: నటుడు శరత్ బాబు కన్నుమూత